Paytm | చాట్‌జీపీటీలోనే పేటీఎం పేమెంట్స్.. ఇక చెల్లింపుల వివరాలు క్షణాల్లో..
Paytm | పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్), పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు పూర్తిగా అనుబంధ సంస్థ. తాజాగా ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీతో పేటీఎం పేమెంట్ గేట్‌వే ప్లగిన్‌ను ప్రారంభించింది.
Technology | Published On Sep 8, 2026, 12.14 pm IST
Paytm | పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్), పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు పూర్తిగా అనుబంధ సంస్థ. తాజాగా ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీతో పేటీఎం పేమెంట్ గేట్‌వే ప్లగిన్‌ను ప్రారంభించింది. ఈ అనుసంధానం ద్వారా వ్యాపార సంస్థలు వివిధ డ్యాష్‌బోర్డులు లేదా నివేదికల మధ్య మారాల్సిన అవసరం లేకుండా, చాట్‌జీపీటీలో సహజ భాషలో ప్రశ్నలు అడిగి తమ చెల్లింపులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆగస్టులోనే పేటీఎం పేమెంట్ గేట్‌వే కృత్రిమ మేధ ఆధారిత చెల్లింపు ప్రశ్నల కోసం క్లాడ్‌తో అనుసంధానమైంది. ఇప్పుడు చాట్‌జీపీటీతో చేసిన తాజా అనుసంధానం ద్వారా సంభాషణాత్మక కృత్రిమ మేధ సామర్థ్యాలను మరింత విస్తరించింది.
వివిధ విభాగాల ద్వారా పనులు..
వ్యవస్థాపకులు, ఆర్థిక విభాగాలు, వ్యాపార కార్యకలాపాల బృందాలు ఈ ప్లగిన్ ద్వారా చెల్లింపుల కార్యకలాపాలు, వ్యాపార ధోరణులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు.. ఒక వారంలో జారీ చేసిన పేమెంట్ లింకుల్లో ఎన్ని చెల్లింపులు అయ్యాయో వ్యవస్థాపకులు అడగవచ్చు. నిర్దిష్ట కాలానికి సంబంధించిన వసూళ్లు లేదా సెటిల్‌మెంట్ స్థితిని ఆర్థిక విభాగాలు తెలుసుకోవచ్చు. రీఫండ్ లేదా సబ్‌స్క్రిప్షన్ స్థితిని కార్యకలాపాల బృందాలు పరిశీలించవచ్చు. చాట్‌జీపీటీలో వినియోగదారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, వ్యాపారి అనుమతించిన పేటీఎం పేమెంట్ గేట్‌వే సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఇందులో పేమెంట్ లింకులు, సబ్‌స్క్రిప్షన్లు, రీఫండ్లు, సెటిల్‌మెంట్లు, వ్యాపార నివేదికలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.
మోడల్ కాంటెక్ట్స్ ప్రోటోకాల్ ఆధారంగా..
ఈ అనుసంధానాన్ని మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ ఆధారంగా రూపొందించారు. అధీకృత వ్యాపారి చెల్లింపు సమాచారాన్ని చాట్‌జీపీటీతో సురక్షితంగా అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడుతుంది. డెవలపర్లు ప్రత్యేకమైన ఇంటిగ్రేషన్లను రూపొందించి నిర్వహించాల్సిన అవసరం లేకుండా, చాట్‌జీపీటీలోనే కృత్రిమ మేధ ఆధారిత వ్యాపార, చెల్లింపు వర్క్‌ఫ్లోలను రూపొందించేందుకు ఈ ప్లగిన్ సహాయపడుతుంది. భద్రత కోసం ఈ అనుసంధానంలో సురక్షిత ధ్రువీకరణ విధానం అమలులో ఉంటుంది. సమాచార ప్రాప్యత వ్యాపారి నియంత్రణలోనే ఉంటుంది. అనుసంధానానికి అనుమతించిన సమాచారాన్ని మాత్రమే పొందేలా వ్యవస్థను పరిమితం చేశారు. ప్రస్తుతం ఇది కేవలం చదివే విధానంలో మాత్రమే పనిచేస్తుంది. అంటే పేమెంట్‌ను ప్రారంభించడం, రీఫండ్ జారీ చేయడం లేదా నిధులను బదిలీ చేయడం వంటి చర్యలను చాట్‌జీపీటీ ద్వారా చేయడం సాధ్యం కాదు.
పేటీఎం పేమెంట్ గేట్‌వేలోనే..
చెల్లింపులకు సంబంధించిన అన్ని కార్యాచరణలు పేటీఎం పేమెంట్ గేట్‌వేలోనే కొనసాగుతాయి. వాటిపై పూర్తి నియంత్రణ వ్యాపారి వద్దే ఉంటుంది. ఇప్పటికే ఉన్న డ్యాష్‌బోర్డులు, ఏపీఐలతోపాటు చాట్‌జీపీటీ ద్వారా సంభాషణాత్మకంగా సమాచారాన్ని పొందే అవకాశం ఈ కొత్త అనుసంధానం కల్పిస్తోంది. అలాగే కృత్రిమ మేధ ఆధారిత చెల్లింపులు, ఆర్థిక వర్క్‌ఫ్లోలను రూపొందించుకునే వ్యాపారాలకు ఇది ఒక ప్రామాణిక ఆధారాన్ని అందిస్తుంది. ఈ అనుసంధానంపై పేటీఎం పేమెంట్ గేట్‌వే ప్రతినిధి మాట్లాడుతూ.. వ్యాపారాలకు తమ చెల్లింపులపై సమాధానాలు ఎంత వేగంగా కావాలనుకుంటారో, ఇతర విషయాలపై సమాధానాలు కూడా అంతే వేగంగా కావాలని పేర్కొన్నారు. చాట్‌జీపీటీ నుంచే లావాదేవీలు, రీఫండ్లు, సెటిల్‌మెంట్ల వివరాలను తెలుసుకునే అవకాశం ఈ అనుసంధానం కల్పిస్తుందని తెలిపారు. వ్యాపారాలు ఇప్పటికే విశ్వసిస్తున్న భద్రతా ప్రమాణాలతోనే ఈ సేవ పనిచేస్తుందని వెల్లడించారు.
తాజావార్తలు
- ●Revanth meets Gaddam Prasad | స్పీకర్‌కు రేవంత్, భట్టి ఓదార్పు
- ●G2 Movie | ‘జీ2’లో అడివి శేష్‌కు జోడీగా ఫస్ట్ ఛాయిస్ వామికా కాదట.. ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?
- ●Shruti Haasan | స్టైలిష్ లుక్‌లో శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్..
- ●Teenmar Mallanna | మా దళిత బిడ్డ కూర్చుంటే కళ్లు మండుతున్నయ్: తీన్మార్ మల్లన్న
- ●KTR and Harish Rao Arrest | ఎర్రవల్లి వద్ద హైటెన్షన్: 'ఎవడ్రా నువ్వు' అంటూ పోలీసుల జులుం.. కేటీఆర్, హరీష్ రావుల అరెస్ట్
- ●KCR Erravalli Farmhouse | ఎర్రవల్లికి కాంగ్రెస్ గూండాలు.. మమ్మల్ని ఆపుతారా?

Revanth meets Gaddam Prasad | స్పీకర్‌కు రేవంత్, భట్టి ఓదార్పు

G2 Movie | ‘జీ2’లో అడివి శేష్‌కు జోడీగా ఫస్ట్ ఛాయిస్ వామికా కాదట.. ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?

Shruti Haasan | స్టైలిష్ లుక్‌లో శ్రుతి హాసన్.. నెట్టింట ఫొటోలు వైరల్..

Teenmar Mallanna | మా దళిత బిడ్డ కూర్చుంటే కళ్లు మండుతున్నయ్: తీన్మార్ మల్లన్న






