IAS Officer | వెటర్నరీ ఆఫీసర్ నియామక పరీక్షలో అక్రమాలు.. ఐఏఎస్ అధికారి అరెస్ట్
IAS Officer | వెటర్నరీ ఆఫీసర్ నియామక పరీక్షలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఐఏఎస్ అధికారిని (IAS Officer) సీఐడీ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా అధికారులకు సహకరించకపోవడంతో 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్‌ను (Gyanendra Kumar Gangwar) అదుపులోకి తీసుకున్నది.
IAS Officer | త్రినేత్ర.న్యూస్: వెటర్నరీ ఆఫీసర్ నియామక పరీక్షలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఐఏఎస్ అధికారిని (IAS Officer) సీఐడీ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా అధికారులకు సహకరించకపోవడంతో 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్‌ను (Gyanendra Kumar Gangwar) అదుపులోకి తీసుకున్నది. 2024 జూలైలో పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 400 వెటర్నరీ ఆఫీసర్ పోస్టులకు (Veterinary Officer) కేపీఎస్సీ (KPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక పరీక్ష సందర్భంగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
ఆ సమయంలో కేపీఎస్సీ పరీక్షల నియంత్రణ అధికారిగా (Controller of Examinations) జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ పనిచేశారు. పరీక్షలో భారీగా అక్రమాలు జరిగాయని, ఓఎంఆర్ జవాబు పత్రాలను ట్యాంపరింగ్ చేశారని, దీనికిగాను ఇద్దరు అభ్యర్థుల నుంచి ఆయన దాదాపు రూ.1.1 కోట్లు లంచంగా తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఆయనను పరిశ్రమలు, వాణిజ్య శాఖలో ఎంఎస్ఎంఈ (MSME) డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ సందర్భంగా ఓఎంఆర్ జవాబు పత్రాలను (OMR Answer Sheets) ట్యాంపరింగ్ చేశారని గుర్తించింది.
కాగా, విచారణలో భాగంగా సీఐడీ అధికారులు జ్ఞానేంద్రను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. సుమారు 9 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శనివారం కూడా ఈ వ్యవహారంపై ఆయనను విచారించారు. అయితే అధికారులకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై మొదట విధాన సౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవ్వగా, జూలై 28న ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. మనీ ల్యాండరింగ్ కోణంలో కేసు నమోదుచేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆగస్టు 23న ఆయన బెంగళూరులోని ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు.
సంబంధిత వార్తలు

Couples suicide in Lalaguda | ఇంట్లో ఉరేసుకున్న భార్య.. భయపడిన భర్త ఏం చేశాడంటే..
సెప్టెంబర్ 10, 2026

Prof. CNR Rao | పేరులో ఎక్స్ట్రా ‘F’.. భారతరత్న సీఎన్ఆర్ రావుకు ఈసీ నోటీసులు
సెప్టెంబర్ 9, 2026

Leopard | గాయపడిన చిరుతను కాపాడేందుకు వెళ్లగా.. అధికారులపై దాడి.. షాకింగ్ వీడియో
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



