Eiffel Tower | హిందూ బృందం సందర్శనపై వివాదం.. మూతపడిన ఈఫిల్ టవర్
Eiffel Tower | పారిస్ (Paris)లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ (Eiffel Tower) తాత్కాలికంగా మూతపడింది. బీఏపీఎస్ సంస్థకు చెందిన సుమారు 100 మంది సభ్యుల బృందం (Hindu group) ఈ టవర్ సందర్శించింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న మహిళా సిబ్బంది (women staff)ని పక్కకు తప్పించడం వివాదానికి దారి తీసింది.
Eiffel Tower | త్రినేత్ర.న్యూస్ : పారిస్ (Paris)లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ (Eiffel Tower) తాత్కాలికంగా మూతపడింది. ఓ హిందూ సంస్థకు చెందిన సాధువులు ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న మహిళా సిబ్బందిని (women staff) పక్కకు తప్పించడం వివాదానికి దారితీసింది. దీంతో టవర్‌ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
బోచాసవాసి అక్షర పురుషోత్తమ స్వామినారాయణ (బీఏపీఎస్) సంస్థకు చెందిన సుమారు 100 మంది సభ్యుల బృందం పారిస్ శివార్లలో ఒక హిందూ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల కోసం ఫ్రాన్స్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ఈఫిల్ టవర్ సందర్శనకు వెళ్లింది. ఈ బృందం శనివారం ఈఫిల్ టవర్‌ను సందర్శించింది. హిందూ బృందం సందర్శన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న మహిళా సిబ్బందిని పక్కకు తప్పించారు. వారి స్థానంలో అక్కడ పురుషులను విధుల్లోకి పురమాయించారు. హిందూ సాధువులకు మహిళలు కనబడాకుండా ఉండేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు.
యాజమాన్యం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. మహిళా సిబ్బంది కంటికి కనిపించకుండా ఉండాలని, తమ స్థానాల నుంచి తప్పుకోవాలని, కొన్ని ప్రాంతాలకు దూరంగా ఉండాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసినట్లు కార్మిక సంఘాలు ఆరోపించాయి. మతపరమైన కారణాలతో మహిళా సిబ్బందిని పక్కకు వెళ్లమని యాజమాన్యం ఆదేశించడాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. ఇది పూర్తిగా అంగీకరించలేని లింగ వివక్ష అంటూ సోమవారం కార్మికులు వాకౌట్ చేసి సమ్మెకు దిగారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ కోరారు. ఉద్యోగుల సమ్మెతో దిగొచ్చిన యాజమాన్యం.. ఆ ఘటన పట్ల సిబ్బందికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. వివాదాంపై బీఏపీఎస్ (BAPS) సంస్థ స్పందించింది. తమ బృందం సభ్యులు ఎక్కువగా ఉండటంతో ఇతరులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే అధికారులతో సమన్వయం చేసుకుని ఈ సందర్శనకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపింది. ఆ సమయంలో మహిళా ఉద్యోగులను పక్కకు వెళ్లమని ఆదేశించిన విషయం తమ దృష్టికి రాలేదని తెలిపింది. ఈ మేరకు ఇతరులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది.
Also Read..
నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్రశ్నించిన స్పీకర్
క్రూడ్ ధరల మంట.. మార్కెట్లకు భారీ షాక్..
కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
తాజావార్తలు
- ●Gaddam Prasad Kumar | నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్రశ్నించిన స్పీకర్
- ●Stock Markets | క్రూడ్ ధరల మంట.. మార్కెట్లకు భారీ షాక్..
- ●Padi Kaushik Reddy | కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
- ●Harish Rao | ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనేలా పోలీసుల తీరు: హరీశ్ రావు
- ●Manne Krishank | లోపలేస్తా నా కొడకా తమాషా చేస్తున్నారా.. మన్నె క్రిశాంక్‌పై కార్కానా సీఐ వీరంగం
- ●KCR | ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు

Gaddam Prasad Kumar | నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్రశ్నించిన స్పీకర్

Stock Markets | క్రూడ్ ధరల మంట.. మార్కెట్లకు భారీ షాక్..

Padi Kaushik Reddy | కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

Harish Rao | ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనేలా పోలీసుల తీరు: హరీశ్ రావు






