VC Sajjanar | ఆన్‌లైన్‌లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
VC Sajjanar | హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి (Vinayaka Chavithi) ఉత్సవాల సందడి మొదలైంది. వినాయక విగ్రహాలు పెట్టాలనుకునే నిర్వాహకులు మండపాలకు (Ganesh Pandals) సంబంధించిన వివరాలను ముందుగా నమోదుచేయాలని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.
VC Sajjanar | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి (Vinayaka Chavithi) ఉత్సవాల సందడి మొదలైంది. వినాయక విగ్రహాలు పెట్టాలనుకునే నిర్వాహకులు మండపాలకు (Ganesh Pandals) సంబంధించిన వివరాలను ముందుగా నమోదుచేయాలని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటు, నిమజ్జన వివరాలు ముందుగానే తెలిస్తే ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (VC Sajjanar) ట్వీట్ చేశారు.
`నిర్వాహకులు వెంటనే http://policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. తుది నిమిషం దాకా వేచిచూడకుండా అధికారిక పోర్టల్ ద్వారా సమాచారం అందించి హైదరాబాద్ సిటీ పోలీస్‌కు సహకరించాలి. మండపాల ఏర్పాటు, నిమజ్జన వివరాలు ముందుగానే తెలిస్తే ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు యంత్రాంగానికి వీలవుతుంది` అని పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి!
గణేశ్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగానే ఆన్లైన్ ద్వారా నమోదు (ఇంటిమేషన్) చేసుకోవాలి.
నిర్వాహకులు వెంటనే https://t.co/nPkBWSGA6b పోర్టల్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
తుది నిమిషం దాకా… https://t.co/LOzU0zGXJD
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) September 8, 2026
తాజావార్తలు
- ●Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
- ●Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో మళ్లీ జోష్..
- ●MLA Sanjay | మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులా..!
- ●Harish Rao | కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి: హరీశ్ రావు
- ●MLA Vijaya Ramana Rao | మహానటి సావిత్రి కంటే గొప్పగా నటిస్తున్నారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు
- ●Eiffel Tower | హిందూ బృందం సందర్శనపై వివాదం.. మూతపడిన ఈఫిల్ టవర్

Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో మళ్లీ జోష్..

MLA Sanjay | మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులా..!

Harish Rao | కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి: హరీశ్ రావు






