KSRTC | ఎయిర్ హోస్టెస్, ఫ్రీ వైఫై.. విమానాన్ని తలపించే ఆర్టీసీ బస్సు.. ఎక్కడో తెలుసా..?
KSRTC | ప్రయాణికులకు విమానంలో ప్రయాణిస్తున్న ఫీల్ కలిగేలా కేరళ ప్రభుత్వం (KSRTC) ఓ ప్రీమియం బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. తిరువనంతపురం-కొచ్చి నగరాల మధ్య అందుబాటులో ఉన్న ఈ బస్సులో మొత్తం విమాన తరహా లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
KSRTC | త్రినేత్ర.న్యూస్ : సాధారణంగా ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ప్రయాణం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రద్దీనే. కిక్కిరిసిన జనం, నిల్చోడానికి కూడా ఖాళీ లేని రద్దీతో బస్సులో ప్రయాణించాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతుంటారు. ప్రస్తుతం సౌత్ రాష్ట్రాల్లో చాలా వరకూ మహిళలకు ఆయా ప్రభుత్వాలు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తుండటంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి సమయంలో కేరళ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు విమానంలో ప్రయాణిస్తున్న ఫీల్ కలిగేలా ఓ ప్రీమియం బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది (road travel a flight like feel).
కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్తగా ప్రారంభించిన అత్యాధునిక బస్సు సర్వీసుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లగ్జరీ బస్సు సర్వీసును తిరువనంతపురం-కొచ్చి నగరాల మధ్య నడుపుతున్నారు. ఈ బస్సులో మొత్తం విమాన తరహా లగ్జరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. విలాసవంతమైన లెదర్ సీట్లు, ప్రతీ సీటు వద్దా వినోదం కోసం ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, మొబైల్ ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. అంతేకాదు, ప్రయాణికులకు ఉచిత వైఫై సౌకర్యం కూడా ఉందండోయ్.
మరో ప్రత్యేక విషయం ఏంటంటే..? ప్రయాణికులకు సహాయం చేసేందుకు విమానాల్లో ఎయిర్ హోస్టెస్ ఉన్నట్లే, ఈ బస్సులో కూడా ఒక హోస్టెస్ ఉంటారు. వేడివేడి పానీయాలు, స్నాక్స్, టిఫిన్స్, రోల్స్ వంటి ఆహార పదార్థాలను కూడా ఇందులో అందుబాటులో ఉంచారు. అంతేకాదు, వాష్‌రూమ్ సౌకర్యం కూడా కల్పించడం విశేషం. తిరువనంతపురం-కొచ్చి నగరాల మధ్య ప్రయాణించే వారికి ఇది సాధారణ బస్సు ప్రయాణానికి మించిన అనుభూతిని అందిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని ప్రముఖ వ్లాగర్ అజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ఇకపై బిజినెస్ క్లాస్ సౌకర్యం అంతర్జాతీయ విమానాల్లోనే కాదు.. కేరళ కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కూడా అందుబాటులోకి వచ్చింది" అని పేర్కొన్నారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం ఇంతటి ప్రీమియమ్ లగ్జరీ ఆర్టీసీ బస్సుపై మీరూ ఓ లుక్కేయండి.
KSRTC's Business Class bus service - looks impressive - nice recliner seats, washroom, and a hostess to serve food and refreshments. Now I just hope that Kerala improved it's roads further to make the service more smooth. #Kerala #bus #transport
Video courtesy, Ajay Johny! pic.twitter.com/PK0bxM33mc
— Ananth Rupanagudi (@AnanthOnTrack) September 5, 2026
Also Read..
ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
హిందూ బృందం సందర్శనపై వివాదం.. మూతపడిన ఈఫిల్ టవర్
కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
తాజావార్తలు
- ●Vakiti Srihari | ఇప్పటికీ పెత్తందార్ల పోకడలు కొనసాగడం దురదృష్టకరం: మంత్రి వాకిటి శ్రీహరి
- ●Paytm | చాట్జీపీటీలోనే పేటీఎం పేమెంట్స్.. ఇక చెల్లింపుల వివరాలు క్షణాల్లో..
- ●VC Sajjanar | ఆన్లైన్లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
- ●Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
- ●Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో మళ్లీ జోష్..
- ●MLA Sanjay | మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులా..!

Vakiti Srihari | ఇప్పటికీ పెత్తందార్ల పోకడలు కొనసాగడం దురదృష్టకరం: మంత్రి వాకిటి శ్రీహరి

Paytm | చాట్జీపీటీలోనే పేటీఎం పేమెంట్స్.. ఇక చెల్లింపుల వివరాలు క్షణాల్లో..

VC Sajjanar | ఆన్లైన్లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి: హైదరాబాద్ సీపీ సజ్జనార్

Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ



