Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
Nepal Flash Floods | నేపాల్ వరదలు (Nepal Flash Floods) ఎన్నో కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఈ విపత్తులో తల్లిదండ్రులను కోల్పోయిన 12 ఏళ్ల బాలుడు కథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తల్లిదండ్రులు శాశ్వతంగా దూరమయ్యారనే చేదు నిజం తెలియని ఆ చిన్నారి అమాయకత్వం కలచివేస్తోంది. అమ్మ, నాన్న క్షేమంగా వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న ఆ పసివాడి వేదన నేపాల్ వరదలు మిగిల్చిన తీవ్ర విషాదానికి అద్దం పడుతోంది.
International | Published On Sep 8, 2026, 11.31 am IST
Nepal Flash Floods | త్రినేత్ర.న్యూస్ : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు (Nepal Flash Floods) అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. వేలాది మంది నిరాశ్రయులవగా, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తులో తల్లిదండ్రులను కోల్పోయిన 12 ఏళ్ల బాలుడు కథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎప్పటికీ తిరిగి రాని తన తల్లిదండ్రుల కోసం ఆ బాలుడి ఎదురుచూపు కలచివేస్తోంది.
ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో హిమానీనదం (Glacier) విరిగిపడి సంభవించిన జలప్రళయం వల్ల 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గల్లంతయ్యారు. ఈ ఘోర విపత్తులో కాఠ్‌మాండూకు చెందిన కమ్మి, ఫర్సంగ్ దంపతులు వరద నీటిలో కొట్టుకుపోయి మరణించారు. అయితే, ఈ విపత్తు నుంచి వారి 12 ఏళ్ల కుమారుడు ట్సెరింగ్ (Tsering) ప్రాణాలతో బయటపడ్డాడు. తల్లిదండ్రులు చనిపోయారన్న నిజం ఆ చిన్నారికి తెలియదు. ప్రస్తుతం బాలుడు తన మేనత్త వద్ద పెరుగుతున్నాడు.
అయితే, తన తల్లిదండ్రులు ఇక ఎప్పటికీ తిరిగిరారన్న చేదు నిజాన్ని ఆ చిన్నారికి తన మేనత్త చెప్పే ధైర్యం చేయలేదు. అమ్మ, నాన్న ఎక్కడ..? ఎప్పుడొస్తారు..? అంటూ చిన్నారి వారిని అడగ్గా.. వరదల కారణంగా వారు అడవిలో ఎక్కడో ఉన్నారని చెబుతూ వస్తోంది. రోడ్లు ధ్వంసమయ్యాయని వారు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుందని నమ్మించింది. ఏడాది లేదా రెండేళ్ల సమయం కూడా పట్టొచ్చని తెలిపింది. మేనత్త మాటలను నమ్మిన బాలుడు తన తల్లిదండ్రులు ఎప్పటికైనా తిరిగిస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్నాడు.
అయితే, తోటి పిల్లలు తమ వారిని కోల్పోయి ఏడుస్తుంటే.. వారికి ఓదార్పునిస్తూనే తన తల్లిదండ్రులు అడవికి వెళ్లారని, తిరిగి వస్తారని ట్సెరింగ్ నమ్మడం అక్కడున్న వారిని మరింత కలచివేసింది. ఆ బాలుడి మాటలు విన్న స్థానికులు గుండెలు తరుక్కుపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లిదండ్రులు శాశ్వతంగా దూరమయ్యారనే చేదు నిజం తెలియని ఆ చిన్నారి అమాయకత్వానికి వారు తీవ్రంగా చలించిపోయారు. బాలుడి నోటి వెంట వచ్చిన ఆ అమాయకపు మాటలు విన్న స్థానిక ప్రజలు, బంధువులు ఆ చిన్నారికి చేదు నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక, వాస్తవాన్ని జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు. ఎప్పటికీ తిరిగి రాని తల్లిదండ్రుల కోసం, వారు అడవి నుంచి క్షేమంగా వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న ఆ 12 ఏళ్ల పసివాడి వేదన నేపాల్ వరదలు మిగిల్చిన తీవ్ర విషాదానికి అద్దం పడుతోంది.
మరోవైపు ఈ డెడ్లీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1400కు చేరింది. ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు చేపట్టే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. నేపాల్, చైనా దేశాల్లో మొత్తం 5,500 మంది మిస్సయ్యారు. వారి ఆచూకీ ఇప్పటికీ తెలియారలేదు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
హిందూ బృందం సందర్శనపై వివాదం.. మూతపడిన ఈఫిల్ టవర్
నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్రశ్నించిన స్పీకర్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్‌లలో మళ్లీ జోష్..
సంబంధిత వార్తలు

Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు
సెప్టెంబర్ 5, 2026

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
సెప్టెంబర్ 4, 2026

Earthquake | జల ప్రళయం వేళ.. టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్‌లలో మళ్లీ జోష్..
- ●MLA Sanjay | మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులా..!
- ●Harish Rao | కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి: హరీశ్ రావు
- ●MLA Vijaya Ramana Rao | మహానటి సావిత్రి కంటే గొప్పగా నటిస్తున్నారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు
- ●Eiffel Tower | హిందూ బృందం సందర్శనపై వివాదం.. మూతపడిన ఈఫిల్ టవర్
- ●Gaddam Prasad Kumar | నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్రశ్నించిన స్పీకర్

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్‌లలో మళ్లీ జోష్..

MLA Sanjay | మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులా..!

Harish Rao | కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి: హరీశ్ రావు

MLA Vijaya Ramana Rao | మహానటి సావిత్రి కంటే గొప్పగా నటిస్తున్నారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు



