Lashkar terrorist | భారత్‌లో దాడులకు కుట్ర.. లష్కరే టెర్రరిస్ట్ అరెస్ట్
Lashkar terrorist | బంగ్లాదేశ్ (Bangladesh) కేంద్రంగా భారత్‌లో దాడులకు కుట్ర పన్నిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని (Lashkar terrorist) పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు.
Lashkar terrorist | బంగ్లాదేశ్ (Bangladesh) కేంద్రంగా భారత్‌లో దాడులకు కుట్ర పన్నిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని (Lashkar terrorist) పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. నిందితుడిని జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా కంగన్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ అహ్మద్‌లోన్, అలియాస్ రాజా, అలియాస్ కశ్మీరీగా గుర్తించారు.
అతడు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్‌లో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఈ కుట్రలో పాక్ ప్రమేయం బయటపడకుండా జాగ్రత్త పడుతూ భారత్‌లో దాడులు చేసేందుకు బంగ్లా పౌరులను, భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిని నియమించుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఇటీవలే ఢిల్లీ, దక్షిణ భారత్‌లో పట్టుబడిన టెర్రరిస్ట్ మాడ్యూల్‌తో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షబ్బీర్ అహ్మద్ లోన్ లష్కరే తోయిబాలో శిక్షణపొందిన ఉగ్రవాది. ముజఫరాబాద్‌లోని ఉగ్రవాద శిబిరంలో ఇతడు ప్రాథమిక, అడ్వాన్స్‌డ్ శిక్షణ పొందాడు. ఈ సంస్థలోని అగ్ర నాయకత్వంతో అతడికి దాదాపు రెండు దశాబ్దాల క్రితం నుంచే సంబంధాలు ఉన్నాయి. 2007లో కూడా ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అతడిని అరెస్ట్ చేసింది. అప్పట్లో ఇతడి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఒక ఏకే-47 రైఫిల్, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలోనే 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, లష్కరే కమాండర్ జాకీర్ ఉర్ రెహ్మాన్ లఖ్వీతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇక 2018 వరకూ అతడు తీహార్ జైల్లోనే శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలై బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. ఇప్పుడు బంగ్లా కేంద్రంగా తన లష్కరే నెట్‌వర్క్‌లను పునర్నిర్మించి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఢిల్లీ సరిహద్దుల్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లష్కరే నెట్‌వర్క్, రిక్రూట్‌మెంట్, నిధుల సేకరణ, భారత్‌లో వారు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు షబ్బీర్ అహ్మద్‌లోన్‌ను అధికారులు విచారిస్తున్నారు.
Also Read..
కువైట్‌పై ఇరాన్ దాడి.. భారతీయ కార్మికుడు మృతి
ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు : డొనాల్డ్ ట్రంప్
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ దుమారం.. ఫఖర్ జమాన్‌పై ఆరోపణలు..
సంబంధిత వార్తలు

Bangladesh | సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
మే 12, 2026

Lungi Ngidi | ఆసుపత్రి నుంచి లుంగి ఎంగిడీ డిశ్చార్జి.. బాగానే ఉన్నానని తెలిపిన ఫాస్ట్ బౌలర్..!
ఏప్రిల్ 26, 2026

Indian High Commissioner | బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా బెంగాల్ బీజేపీ నేత!
ఏప్రిల్ 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



