త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lungi Ngidi | ఆసుప‌త్రి నుంచి లుంగి ఎంగిడీ డిశ్చార్జి.. బాగానే ఉన్నాన‌ని తెలిపిన ఫాస్ట్ బౌల‌ర్‌..!

Lungi Ngidi | ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడీ గాయంతో ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. త‌న ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

P

Sports | Published On Apr 26, 2026, 5.34 pm IST

Lungi Ngidi | ఆసుప‌త్రి నుంచి లుంగి ఎంగిడీ డిశ్చార్జి.. బాగానే ఉన్నాన‌ని తెలిపిన ఫాస్ట్ బౌల‌ర్‌..!
Advertisement

Lungi Ngidi | ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడీ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ త‌ల‌కు గాయ‌మైన విష‌యం తెలిసిందే. పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో మిడ్‌ఆఫ్ నుంచి క్యాచ్ పట్టేందుకు పరుగెత్తిన ఎంగిడీ బ్యాలెన్స్ కోల్పోయి ప‌డిపోయాడు. దాంతో తల వెనుక భాగం నేలపై బలంగా తగిలింది. గాయం తీవ్రతను గమనించిన వెంటనే ఫిజియోథెరపిస్ట్ మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. ముందు జాగ్ర‌త్త‌గా మెడ‌కు నెక్ బ్రేస్ అమ‌ర్చిన వైద్య సిబ్బంది.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు తరలించారు.

అనంతరం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స సమయంలో ఆయన స్పృహలోనే ఉండి వైద్యులతో మాట్లాడినట్లు సమాచారం. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు స్టేడియం నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. దాంతో భారీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కేవలం 11 నిమిషాల్లోనే ఆసుపత్రికి చేర్చారు. తర్వాత బీఎల్‌కే మ్యాక్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో చికిత్స అందించారు. మ్యాచ్ సమయంలో తలకు, మెడ వెనుక భాగానికి గాయాలు కావడంతో కొంత స‌మ‌యం వైద్యుల ప‌రిశీల‌న‌లో ఉంచారు. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని జట్టు వర్గాలు తెలిపాయి. వైద్యులు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement