Vande Mataram | కేరళలో మరోసారి వందేమాతరంపై వివాదం.. ప్రభుత్వ తీరుపై గవర్నర్ అసంతృప్తి
Vande Mataram | కేరళ రాజకీయాల్లో మరోసారి 'వందేమాతరం'పై (Vande Mataram) వివాదం చెలరేగింది. యూడీఎఫ్ పాలసీ అడ్రస్ సందర్భంగా అసెంబ్లీలో 'వందేమాతరం' గేయాన్ని పూర్తిగా ఆలపించకపోవడంపై కేరళ గవర్నర్ (Kerala Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Vande Mataram | కేరళ రాజకీయాల్లో మరోసారి 'వందేమాతరం'పై (Vande Mataram) వివాదం చెలరేగింది. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) పాలసీ అడ్రస్ సందర్భంగా అసెంబ్లీలో 'వందేమాతరం' గేయాన్ని పూర్తిగా ఆలపించకపోవడంపై కేరళ గవర్నర్ (Kerala Governor) రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన గవర్నర్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
గవర్నర్ పాల్గొనే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ అనుసరించాలని అన్నారు. కేరళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ముందు, తరువాత ఒక బ్యాండ్ టీమ్ 'వందేమాతరం' ఆలపించలేదని, గీతంలోని మొదటి చరణాలను ప్లే మాత్రమే చేసినట్లు చెప్పారు. ఈ విషయమై తాను ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ తిరువాంచూర్ రాధాకృష్ణన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం అంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు.
VIDEO | Thiruvananthapuram: Kerala Governor Rajendra Vishwanath Arlekar on truncated 'Vande Mataram' being reportedly played ahead of his address in the state Assembly, says, "What we had insisted that there has to be, whenever Governor is present, it is the protocol, you are… pic.twitter.com/liuZK9IBsx
— Press Trust of India (@PTI_News) May 29, 2026
గవర్నర్‌ను అవమానించడమే..
ప్రభుత్వ తీరుపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. అసెంబ్లీలో జాతీయ గేయం వందేమాతరం పూర్తిగా ఆలపించకపోవడం గవర్నర్‌ను అవమానించడమే అని ఆరోపించింది. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాల్లో వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత, కజకూటం ఎమ్మెల్యే మురళీధరన్ గుర్తు చేశారు. అయితే, కేరళ అసెంబ్లీలో కేంద్రం ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని మండిపడ్డారు.
"ఇది లోక్ భవన్, గవర్నర్‌ను అవమానించడమే. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఇలా చేయడం జాతీయ గేయాన్ని కూడా అగౌరవపరచడమే" అని అన్నారు. వీడీ సతీశన్ (V D Satheesan) సారథ్యంలోని యూడీఎఫ్ ప్రభుత్వం జమాతే ఇస్లామీ, సీపీఎం అభిప్రాయాలకు తలొగ్గుతోందని ఆరోపించారు. దీన్ని బట్టి జాతీయగీతం సెక్యులర్ లైన్స్‌లో లేదంటూ ఆ పార్టీలు చేస్తున్న వాదనతో ప్రభుత్వం ఏకీభవించినట్టు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు.
Also Read..
వ్యభిచారం నేరం కాదు.. సెక్స్ వర్కర్లను వేధించొద్దు : సుప్రీంకోర్టు
కాక్రోచ్ పార్టీకి షాక్.. ఎక్స్ ఖాతా పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన హైకోర్టు
రైతులకు 3 గంటల కరెంట్ చాలట.. ఇది రేవంత్ మనసులోని ఆలోచనే : హరీశ్‌రావు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల






