PM Modi | కేరళ ఎట్టకేలకు కేరళంగా మారింది : ప్రధాని మోదీ
PM Modi | దక్షిణాది రాష్ట్రం కేరళ (Kerala) పేరు కేరళంగా (Keralam) మారడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా తొలిసారి స్పందించారు. ఇది ఆ రాష్ట్ర ప్రజలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.
PM Modi | దక్షిణాది రాష్ట్రం కేరళ (Kerala) పేరు కేరళంగా (Keralam) మారడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా తొలిసారి స్పందించారు. ఇది ఆ రాష్ట్ర ప్రజలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
"నేను మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఓ విధమైన సంతోషం కనిపించింది. మలయాళీ సోదర సోదరీమణుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కేరళ పేరును కేరళంగా మార్చాలని మీరు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది. ఎట్టకేలకు కేరళకు కేరళం అనే దాని అసలు పేరు దక్కింది. ఇది రాష్ట్ర ప్రజలకు దక్కిన గౌరవం. ఇప్పుడు మీ అందరి ముఖాల్లో నేను ఆనందం చూడగలుగుతున్నాను" అని ప్రధాని పేర్కొన్నారు.
‘మలయాళంలో రాష్ట్రం పేరును ‘కేరళం’ అని పిలిచేవారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటం కాలం నుంచి మలయాళం మాట్లాడే వర్గాల కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ లో రాష్ట్రం పేరును కేరళ అని రాసి ఉంది. దీంతో దాన్ని కేరళంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే కేరళను కేరళం (Keralam)గా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
Also Read..
వంటగదుల్లో ఇరాన్ మంటలు.. పెరుగుతున్న కట్టెలపొయ్యిల వినియోగం
హరీశ్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి.. చికిత్స నిలిపివేయచ్చంటూ తీర్పు
మొజ్తాబా ఖమేనీ ఎక్కడ..? యుద్ధంలో గాయపడిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..?
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






