Harish Rana | హరీశ్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి.. చికిత్స నిలిపివేయచ్చంటూ తీర్పు
Harish Rana | సుమారు 13 ఏండ్లుగా కోమాలో (Coma) ఉండి జీవచ్ఛవంలా మారిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి 32 ఏండ్ల హరీశ్ రాణా (Harish Rana) కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది.
Harish Rana | సుమారు 13 ఏండ్లుగా కోమాలో (Coma) ఉండి జీవచ్ఛవంలా మారిన సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థి 32 ఏండ్ల హరీశ్ రాణా (Harish Rana) కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. ఆయన కారుణ్య మరణానికి కోర్టు అనుమతించింది. హరీశ్ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు లైఫ్ సపోర్ట్‌ను తొలగించేందుకు కోర్టు అంగీకరించింది. ఆయనకు చికిత్స నిలిపివేయచ్చని వెల్లడించింది. ఈ మేరకు తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం జనవరి 15న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. నేడు తుది తీర్పు వెలువరించింది. అదేవిధంగా పాసివ్ యుతనేసియాపై చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోర్టు కోరింది.
ఎవరీ హరీశ్ రాణా..
ఢిల్లీకి చెందిన 32 ఏండ్ల హరీశ్ రాణా.. చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో, 2013 ఆగస్టు 20న ప్రమాదవశాత్తు పీజీ హాస్టల్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ దవాఖాల్లో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటినుంచి కోమాలోనే ఉండిపోయాడు.
ఇన్నేండ్లుగా అతని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి చూసుకుంటున్నారు. అయితే జీవచ్చవంలా పడిఉన్న తమ కుమారుడిని కారుణ్య మరణానికి అనుమతించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇదే విషయమై సుప్రీంకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. అయితే, హరీశ్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో మళ్లీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లారు. మెడికల్ రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు.. హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జనవరి 15న తీర్పును రిజర్వ్ చేశారు. మార్చి 11న తుది తీర్పును వెళ్లడిస్తామని స్పష్టం చేశారు.
Also Read..
Mojtaba Khamenei | మొజ్తాబా ఖమేనీ ఎక్కడ..? యుద్ధంలో గాయపడిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..?
iPhone 17 | భారీ తగ్గింపు ధరకు లభిస్తున్న ఐఫోన్ 17.. ఎందులో అంటే..?
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






