Mojtaba Khamenei | మొజ్తాబా ఖమేనీ ఎక్కడ..? యుద్ధంలో గాయపడిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..?
Mojtaba Khamenei | అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.
International | Published On Mar 11, 2026, 11.42 am IST
Mojtaba Khamenei | అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నియామకాన్ని ఇరాన్ 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' అధికారికంగా ప్రకటించింది. తదుపరి సుప్రీం లీడర్‌గా మొజ్తాబాను ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన వచ్చి నాలుగు రోజులు అవుతున్నా.. ఆయన ఎక్కడా బయట కనిపించకపోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన తన మద్దతుదారుల ముందుకు రాకపోవడం, ఎలాంటి సందేశం విడుదల చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఆయన కార్యాలయం కూడా మొజ్తాబాకు సంబంధించి ఎలాంటి వివరాలనూ పంచుకోవడం లేదు. ప్రభుత్వ మీడియా మాత్రం ఆయన పాత ఫుటేజీలను ఉపయోగిస్తూ ఆయన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
ఈ నేపథ్యంలో కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో బహుశా ఆయన గాయపడి ఉండొచ్చంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా కొత్త సుప్రీం లీడర్‌ను "జాన్‌బాజ్ ఆఫ్ రమదాన్" అంటూ పేర్కొంటోంది. అంటే రమదాన్ యుద్ధంలో గాయపడిన వీరుడు అని అర్థం. దీంతో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్న తర్వాత ఎవరైనా సరే దేశ ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని విడుదల చేస్తుంటారు. లేదంటే రాతపూర్వకంగా అయినా ప్రకటన చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. దీంతో మొజ్తాబా ఖమేనీ ఎక్కడ..? అంటూ ఇరాన్‌లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కటౌట్‌లతో ర్యాలీ..
సుప్రీం లీడర్‌గా ఎన్నికైన తర్వాత కూడా ఆయన బయటకు రాకపోవడం తీవ్ర చర్చనీయాశంమవుతోంది. ఇక తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మొజ్తాబాకు మద్దతుగా ఆయన మద్దతుదారులు ఆ దేశంలో ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. టెహ్రాన్‌లో నిర్వహించిన సభకు ఆయన ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా హాజరుకాకపోవడంతో ఆయన మద్దతుదారులు కటౌట్‌ను తీసుకొచ్చిపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఎన్ఓపీవో రక్షణలో ముజ్తాబా ఖమేనీ..?
అయితే, తండ్రి హత్య తర్వాత కొత్త సుప్రీంలీడర్‌ను రక్షించుకునేందుకు ఇరాన్ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు అమెరికా మీడియా పేర్కొంటోంది. ఇరాన్ ప్రత్యేక ఉగ్రవాద వ్యతిరేకదళం ఎన్ఓపీవో ముజ్తాబాకు రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడిస్తోంది. ఇజ్రాయెల్-యూఎస్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఆయన ఉనికి బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నట్లు పేర్కొంటోంది. ఖమేనీ మరణానంతరం ముజ్తాబా ఖమేనీకి ఎన్ఓపీవో రక్షణ కల్పిస్తున్నట్లు పారిస్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ విదేశీ వ్యవహారాల కమిటీ ప్రతినిధి అలీ సఫావీ తెలిపినట్లు అమెరికా మీడియా నివేదిస్తోంది. ఎన్ఓపీవో ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన, రహస్యమైన భద్రతా దళం. అంతేకాదు, అత్యంత క్షిష్టమైన ఆపరేషన్లు చేపట్టే ఓ ప్రత్యేక విభాగం కూడా.
Also Read..
హర్మూజ్ సమీపంలో ఇరాన్ మైన్ లేయింగ్స్‌పై అమెరికా భీకర దాడులు
పొట్టను దాచుకోలేకపోతున్నా.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
13 ఏండ్లు కోమాలోనే.. అతనికి చనిపోయే హక్కు ఉందా?.. నేడు సుప్రీంకోర్టు తీర్పు
సంబంధిత వార్తలు

Mojtaba Khamenei | తీవ్ర గాయాలయ్యాయన్న వదంతుల వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ వీడియో రిలీజ్
ఆగస్టు 9, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు ధరల షాక్.. సూచీలు భారీగా పతనం..
జులై 24, 2026

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు..
జులై 20, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



