త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | రుదాలీల మాదిరి.. ‘క‌ల్వ‌కుంట్ల’ తెగ‌కు ఏడుపే

Telangana | రాజ‌స్థాన్‌లో ఎవ‌రైనా చ‌నిపోతే రుదాలీ అనే తెగ‌కు చెందిన వారు ఏడుస్తారు.. వాళ్ల మాదిరిగానే తెలంగాణకు ఏ మంచి జరిగినా, ప్రజలకు లాభం కలిగినా, అభివృద్ధి జరిగినా కల్వకుంట్ల తెగ ఏడుస్తుంద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమ‌ర్శించారు.

S

Telangana | Published On Jul 8, 2026, 3.48 pm IST

Telangana | రుదాలీల మాదిరి.. ‘క‌ల్వ‌కుంట్ల’ తెగ‌కు ఏడుపే
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : రాజ‌స్థాన్‌లో ఎవ‌రైనా చ‌నిపోతే రుదాలీ అనే తెగ‌కు చెందిన వారు ఏడుస్తారు.. వాళ్ల మాదిరిగానే తెలంగాణకు ఏ మంచి జరిగినా, ప్రజలకు లాభం కలిగినా, అభివృద్ధి జరిగినా కల్వకుంట్ల తెగ ఏడుస్తుంద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమ‌ర్శించారు. గాంధీ భ‌వ‌న్‌లో యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధ‌వారం మీడియాతో మాట్లారు.

ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే ఏడుపు.. మూసీ ప్రక్షాళన చేస్తే ఏడుపు.. రైతులకు బోనస్ ఇస్తే ఏడుపు. 25 లక్షల కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసినా బీఆర్ఎస్‌కు బాధే. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని వ్యతిరేకించడమే బీఆర్ఎస్ పని. మేడిగడ్డను నిర్మించింది, డిజైన్ మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ కుంగిపోయింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం మేడిగడ్డ ప్రాంతం భారీ బ్యారేజీ నిర్మాణానికి అనుకూలం కాదు. ఇప్పుడు బలవంతంగా నీళ్లు నింపితే బ్యారేజీ ఊడిపోయి 44 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయాలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ కాదు. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులు నిపుణుల సూచనలతో కాంగ్రెస్ నిర్మించింది. సమయం బట్టి డాక్టర్, ఇంజినీర్ అవతారాలు ఎత్తే పగటి వేషగాళ్ల కుటుంబం బీఆర్ఎస్ అని యెన్నం విమ‌ర్శించారు.

బ్లాక్‌మెయిల్ చేసి రాజకీయ లబ్ధి పొందడం కాంగ్రెస్ విధానం కాదు

మహారాష్ట్రతో 152 మీటర్ల ఒప్పందం చేసుకుని రాజ్‌భవన్‌లో దావత్ చేసుకున్నది బీఆర్ఎస్‌నే. ప్రధాని మోదీతో రాజకీయ సాన్నిహిత్యం పెట్టుకున్నది కూడా బీఆర్ఎస్ నాయకత్వమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ముంపు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మెట్రో కోసం కేంద్రంతో.. కృష్ణా, తుంగభద్ర జలాల కోసం పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారు. సమస్యలను లొల్లి, బ్లాక్‌మెయిల్ చేసి రాజకీయ లబ్ధి పొందడం కాంగ్రెస్ విధానం కాదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

హరీష్ రావు బీజేపీలో చేరేందుకు రంధ్రాన్వేషణ

హరీష్ రావు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు. పార్టీ పగ్గాలు కేటీఆర్‌కే వెళ్తాయని తెలిసి హరీష్ రావు బీజేపీలో చేరేందుకు రంధ్రాన్వేషణ చేస్తున్నారు. దమ్ముంటే సిద్ధిపేట, సిరిసిల్లలను వదిలి పక్క నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవాలి. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్‌గా జడ్పిటిసిగా గెలిచారు. కొడంగల్‌లో గెలిచారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి తన సత్తా చాటుకున్నారు అని ఎమ్మెల్యే తెలిపారు.

మనవడి కోసం బయటకు వచ్చిన కేసీఆర్..

కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురండి.. కాళేశ్వరం అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం. మీరు మమ్మల్ని ఒప్పిస్తే మూడు సంవత్సరాల పాటు కాళేశ్వరం నిర్వహణ బాధ్యత బీఆర్ఎస్‌కే ఇస్తాం. అసెంబ్లీలో నిలబడి తినాల్సిన అవసరం లేదు.. సెంట్రల్ హాల్‌లో కూర్చుని తినే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి కాళేశ్వరం సమస్యకు పరిష్కారం చెప్పాలి. దొంగ ఆరోపణలు చేయడం మానేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు రావాలి. మనవడి కోసం బయటకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణ ప్రజల కోసం ఎందుకు బయటకు రావడం లేదు? అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిల‌దీశారు.

Advertisement
Advertisement