Tollywood | అందాల భామలు.. తగ్గేదేలే!
Tollywood | సినీ రంగంలో విజయాలు, అపజయాలు సహజం. అయితే, హీరోల కెరీర్‌తో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ సున్నితంగా ఉంటుంది. ఒక సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా హీరోలు కొంత విరామం తీసుకుని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. హీరోయిన్ల విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. వరుస పరాజయాలు ఎదురైతే అవకాశాలు తగ్గిపోవడం, కెరీర్‌పై ప్రభావం పడడం ఇండస్ట్రీలో సాధారణంగానే కనిపిస్తుంది.
Entertainment | Published On Jul 8, 2026, 3.10 pm IST
- హిట్స్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న తారలు
- వరుస అవకాశాలతో బిజీబిజీగా హీరోయిన్లు
- కయాదు లోహర్ చేతిలో ఏడు ప్రాజెక్టులు
- ప్రీతి ముకుందన్ ఖాతాలో కొత్త సినిమాలు
- భాగ్యశ్రీకి వరుస అవకాశాలు.. పెరుగుతున్న జోరు
- మళ్లీ క్రేజ్ కోసం కృతి శెట్టి ప్రయత్నాలు
Tollywood | సినీ రంగంలో విజయాలు, అపజయాలు సహజం. అయితే, హీరోల కెరీర్‌తో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ సున్నితంగా ఉంటుంది. ఒక సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా హీరోలు కొంత విరామం తీసుకుని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. హీరోయిన్ల విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. వరుస పరాజయాలు ఎదురైతే అవకాశాలు తగ్గిపోవడం, కెరీర్‌పై ప్రభావం పడడం ఇండస్ట్రీలో సాధారణంగానే కనిపిస్తుంది. అయితే ఒకటి రెండు పరాజయాలతోనే కెరీర్ ముగిసిపోదని పలువురు యంగ్ హీరోయిన్లు నిరూపిస్తున్నారు. సరైన కథలు, మంచి పాత్రలు దొరికితే మళ్లీ పుంజుకోవచ్చని చూపిస్తున్నారు. గతంలో వరుసగా ఎదురుదెబ్బలు తిన్నా.. ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీ అవుతూ తమ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కయాదు లోహర్

ఈ జాబితాలో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది అసోం బ్యూటీ కయాదు లోహర్ గురించే. తెలుగులో ‘ఫంకీ’ మూవీలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఈ అమ్మడు ఆమె కెరీర్‌పై చర్చ మొదలైంది. ఈ సినిమా తర్వాత అవకాశాలు తగ్గిపోతాయని, కెరీర్‌పై ప్రభావం పడుతుందని చాలామంది భావించారు. కానీ కాయదు మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేస్తూ వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం పలు భాషల్లో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం వరుసగా ఏడు సినిమాల్లో నటిస్తుండడం విశేషం. దాన్ని బట్టి సౌత్‌లో అసోం బ్యూటీకి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘ది ప్యారడైజ్’ మూవీలో కనిపించనుంది. అలాగే, తమిళం నాలుగు, మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే, హొంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో సూర్య హీరోగా తెరకెక్కనున్న మూవీలోని హీరోయిన్‌గా ఎంపికైంది.
ప్రీతి ముకుందన్

ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న బ్యూటీ ప్రీతి ముకుందన్. తెలుగులో ‘కన్నప్ప’ మూవీ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో త్రిచి బ్యూటి కెరీర్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. తమిళంలో ఆమె నటించిన ‘బ్లాస్ట్’ మూవీకి మంచి స్పందన వచ్చింది. దాంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ మూవీతో క్రేజ్ సంపాదించింది. ఈ సినిమా విడుదలకు ముందే శర్వానంద్ సరసన నటించే అవకాశాన్ని అందుకోవడం విశేషం. ఇప్పటికే యంగ్ హీరో రోషన్ మేకతో ‘ఏమో ఏమో ఇది’ మూవీలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు విజయవంతమైతే టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయి. తమిళంలో దషమకన్ మూవీతో పాటు హిందీలో నాగ్‌జిల్లా మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే..

మరో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ సైతం వరుస పరాజయాలు ఎదురైనా వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగులో ఇప్పటివరకు ఆమెకు చెప్పుకోదగ్గ సక్సెస్ దక్కలేదు. మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కింగ్డమ్, కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాల్లో నటించిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, తాజాగా అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ నెల 10న రిలీజ్ కానుంది. అలాగే, ప్రస్తుతం శివకార్తికేయన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, స్వప్న సినిమాస్ బ్యానర్‌లోనూ ఓ ప్రాజెక్ట్ చేయబోతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.
కృతిశెట్టి

మరోవైపు కృతి శెట్టి కూడా వరుస పరాజయాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. కెరీర్ ప్రారంభంలోనే తెలుగులో భారీ విజయాలు అందుకున్న ఈ భామకు తర్వాత వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రస్తుతం కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తన కెరీర్‌కు మరో మలుపు ఇస్తుందని ఆమె ఆశిస్తోంది. ప్రస్తుతం తమిళంలో జీనీ మూవీలోని నటిస్తోంది. ఇదిలా ఉండగా.. సినిమా రంగంలో ఒక్క విజయం కెరీర్‌ను మార్చేస్తుంది. వరుస పరాజయాలు వచ్చినా ఒక్క హిట్ పడితే తిరిగి కెరీర్‌లో పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఇదే దిశలో పలువురు యంగ్ హీరోయిన్లు అడుగులు వేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DGP CV Anand | పోలీస్ నియామకాల్లో పారదర్శకతే ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ●Heritage at Every Step 2.0 | మన చరిత్రను బతికిద్దాం: హెరిటేజ్ ఎగ్జిబిషన్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పిలుపు
- ●CM Revanth Reddy | అందెశ్రీ నాకు ఆత్మబంధువు..
- ●CM Revanth Reddy | నువ్వెంత.. నీ జాతి ఎంత..? కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్
- ●Shiv Sena UBT Merger | ఉద్ధవ్ ఠాక్రేకు స్పీకర్ బిగ్ షాక్: ఏక్నాథ్ షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీలు.. టీఎంసీలోనూ చీలిక!
- ●CM Revanth Reddy | గజ్వేల్‌లోనే నిన్ను సమాధి చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి

DGP CV Anand | పోలీస్ నియామకాల్లో పారదర్శకతే ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Heritage at Every Step 2.0 | మన చరిత్రను బతికిద్దాం: హెరిటేజ్ ఎగ్జిబిషన్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పిలుపు

CM Revanth Reddy | అందెశ్రీ నాకు ఆత్మబంధువు..

CM Revanth Reddy | నువ్వెంత.. నీ జాతి ఎంత..? కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్





