Vijay for PM | ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్‌తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!
Vijay for PM | వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి (PM Candidate) ఎవరు? అనే విషయం తమిళనాడు అధికార కూటమిలో చిచ్చుపెట్టింది. పలువురు టీవీకే (TVK) నేతలు పార్టీ అధినేత, సీఎం విజయ్‌ని 2029 ప్రధాని అభ్యర్థిగా (Vijay for PM) తెరపైకి తెస్తున్నారు.
Vijay for PM | త్రినేత్ర.న్యూస్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి (PM Candidate) ఎవరు? అనే విషయం తమిళనాడు అధికార కూటమిలో చిచ్చుపెట్టింది. పలువురు టీవీకే (TVK) నేతలు పార్టీ అధినేత, సీఎం విజయ్‌ని 2029 ప్రధాని అభ్యర్థిగా (Vijay for PM) తెరపైకి తెస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. రాహుల్ గాంధీనే ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ఉండాలని పట్టుబడుతున్నది. దీంతో అధికార కూటమిలోని రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి.
ఈ ఉత్కంఠ నడుమ సెప్టెంబర్ 9న తమిళగ వెట్రి కజగం తన మిత్రపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనుండటంతో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. ఈ సమావేశానికి సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే పార్టీ నేతలను టీవీకే మంత్రులు ఆధవ్ అర్జున, రాజ్ మోహన్, ఆర్. నిర్మల్ కుమార్ ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, అధికార కూటమిలో టీవీకేకు అతిపెద్ద భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి (Congress) మాత్రం ఇప్పటివరకు ఆహ్వానం అందలేదని తెలుస్తున్నది. బుధవారం జరగబోయే ఈ సమావేశం ఎజెండాను టీవీకే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే 2029లో ప్రతిపక్షాల తరపున ప్రధాని రేసులో ఎవరుండాలనే దానిపై టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాల వేళ ఈ భేటీ జరుగుతుండటంతో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయ్ ప్రధాని కావాలంటున్న టీవీకే నేతలు
దేశ అత్యున్నత పదవికి విజయ్ పేరును పలువురు టీవీకే ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రతిపాదించడంతో ఈ వివాదం మొదలైంది. కవుండంపాళయం ఎమ్మెల్యే కనిమొళి మాట్లాడుతూ.. 2029లో టీవీకే ప్రధానమంత్రి అభ్యర్థి విజయ్ (C Joseph Vijay) అని స్పష్టం చేశారు. తదుపరి ప్రధాని ఎవరనేది ఢిల్లీ కాదని, తమిళనాడు (Tamil Nadu) మాత్రమే నిర్ణయిస్తుందని ఆమె నొక్కి చెప్పారు. జాతీయ రాజకీయాల్లో విజయ్ ఒక పెద్ద మార్పు తీసుకువస్తారని, చివరికి రాహుల్ గాంధీ కూడా విజయ్ అభ్యర్థిత్వానికే మద్దతు ఇస్తారని కనిమొళి జోస్యం చెప్పారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) అందించిన మద్దతు వల్లే విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అదే విధంగా, రాహుల్ స్వయంగా విజయ్ చేయి పట్టుకుని, ఆయనను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతారని వ్యాఖ్యానించారు. ఈ ప్రచారంపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని స్పష్టం చేసింది. విజయ్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నది పార్టీ విధానం కాదని, కొందరు కొత్తగా వచ్చిన నేతల అభిమాన భావజాలం మాత్రమేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
సంబంధిత వార్తలు

Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
సెప్టెంబర్ 5, 2026

Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు
సెప్టెంబర్ 4, 2026

Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
- ●Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్
- ●చాక్‌పీస్ వదిలేసి స్మార్ట్‌వాచ్.. టీచర్స్ డేలో జెన్-జీ కొత్త ట్రెండ్!
- ●ఆ సింహాసనంపైనే అందరి కన్ను: తెలంగాణలో 'నయా సీఎం' లీగ్స్!
- ●Horoscope | సెప్టెంబర్ 5 రాశిఫలాలు.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో పట్టుదల అవసరం!
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్

చాక్‌పీస్ వదిలేసి స్మార్ట్‌వాచ్.. టీచర్స్ డేలో జెన్-జీ కొత్త ట్రెండ్!

ఆ సింహాసనంపైనే అందరి కన్ను: తెలంగాణలో 'నయా సీఎం' లీగ్స్!



