MLA Veerlapalli Shankar | కేసీఆర్ చనిపోవాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు
MLA Veerlapalli Shankar | షాద్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతున్నామని.. ఆయన రాష్ట్రానికి పట్టిన పీడ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
MLA Veerlapalli Shankar | త్రినేత్ర.న్యూస్: షాద్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతున్నామని.. ఆయన రాష్ట్రానికి పట్టిన పీడ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. 10 ఏండ్లు పాలించి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
అతని చావు కోరుతున్నం. రాష్ట్రానికి పట్టిన పీడ ఆయన. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసింది బీఆర్ఎస్. 10 ఏండ్లు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. స్పీకర్ స్థానాన్ని కూడా గౌరవిస్తలేరు. వారిని భర్తరఫ్ చేయాలి. 1000 డప్పులు కాదు ఇంకా కొన్ని డప్పులు తీసుకెళ్లి చావు డప్పు కొడతాం. తర్వాత చూస్తరు వాళ్ల పని ఏమైతదో అంటూ శంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా గతంలో కూడా సీఎం రేవంత్ కేసీఆర్‌పై ఇదే విధమైన వ్యాఖ్యాలు చేశారు. కేసీఆర్ స్ట్రెచర్ నుంచి మార్చురీకి వెళ్తారని రేవంత్ అనడంతో బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. కాగా ఎమ్మెల్యే శంకర్ షాద్‌నగర్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
కేసీఆర్ సచ్చిపోవాలి
కేసీఆర్ చనిపోవాలని నేను కోరుకుంటున్నాము
– కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ https://t.co/ZnwHeN0F6T pic.twitter.com/6TcA0pT7uz
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
సంబంధిత వార్తలు

Harish Rao | ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనేలా పోలీసుల తీరు: హరీశ్ రావు
సెప్టెంబర్ 8, 2026

KCR | ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు
సెప్టెంబర్ 8, 2026

Thakkellapally Ravinder Rao | మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన ఈ కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయం: ఎమ్మెల్సీ రవీందర్ రావు
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Leopard | గాయపడిన చిరుతను కాపాడేందుకు వెళ్లగా.. అధికారులపై దాడి.. షాకింగ్ వీడియో
- ●Vakiti Srihari | ఇప్పటికీ పెత్తందార్ల పోకడలు కొనసాగడం దురదృష్టకరం: మంత్రి వాకిటి శ్రీహరి
- ●Paytm | చాట్జీపీటీలోనే పేటీఎం పేమెంట్స్.. ఇక చెల్లింపుల వివరాలు క్షణాల్లో..
- ●KSRTC | ఎయిర్ హోస్టెస్, ఫ్రీ వైఫై.. విమానాన్ని తలపించే ఆర్టీసీ బస్సు.. ఎక్కడో తెలుసా..?
- ●VC Sajjanar | ఆన్లైన్లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
- ●Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ

Leopard | గాయపడిన చిరుతను కాపాడేందుకు వెళ్లగా.. అధికారులపై దాడి.. షాకింగ్ వీడియో

Vakiti Srihari | ఇప్పటికీ పెత్తందార్ల పోకడలు కొనసాగడం దురదృష్టకరం: మంత్రి వాకిటి శ్రీహరి

Paytm | చాట్జీపీటీలోనే పేటీఎం పేమెంట్స్.. ఇక చెల్లింపుల వివరాలు క్షణాల్లో..

KSRTC | ఎయిర్ హోస్టెస్, ఫ్రీ వైఫై.. విమానాన్ని తలపించే ఆర్టీసీ బస్సు.. ఎక్కడో తెలుసా..?



