Pak ISI | పాక్ కోసం గూఢచర్యం.. దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు సిమ్ కార్డులు.. దంపతులు అరెస్ట్
Pak ISI | ఐఎస్ఐతో (Pak ISI) సంబంధాలు కొనసాగిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో ఢిల్లీకి చెందిన ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు.
Pak ISI | త్రినేత్ర.న్యూస్ : పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ఓ గూఢచర్య నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ (Delhi Police Special Cell) ఛేదించింది. ఐఎస్ఐతో (Pak ISI) సంబంధాలు కొనసాగిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో ఢిల్లీకి చెందిన ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను సరాయ్ కాలే ఖాన్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాహిల్ (25), అతని భార్య సమీరా (21)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దంపతులు 2024 నుంచి సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో (Pakistani handlers) నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని సేకరించడంలో వారికి సాయపడినట్లు గుర్తించారు. వీరు 2024-25 మధ్య ఎనిమిది భారత సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్‌లోని తమ హ్యాండ్లర్లకు చేరవేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. అంతేకాదు, పాకిస్థాన్ హ్యాండ్లర్లు ఈ జంటకు డబ్బులు కూడా పంపుతున్నట్లు దర్యాప్తులో వెలడైనట్లు అధికారులు తెలిపారు.
ఆ సిమ్ కార్డుల ద్వారా పాక్ ఏజెంట్లు వాట్సాప్ ఖాతాలను క్రియేట్ చేసి భారత స్థానిక గ్రూపుల్లో చేరుతూ సున్నితమైన సమాచారాన్ని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిలో ఉన్న డిజిటల్ ఆధారాలు, చాటింగ్‌లు, సంభాషణలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు..? ఆర్థిక లావాదేవీలు..? భారత్‌లో వీరికి ఇంకా ఎవరైనా సహకరించారా..? అనే కోణాల్లో స్పెషల్ సేల్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
మరాఠీ మాట్లాడకుంటే కొడతాం.. ట్యాక్సీ డ్రైవర్లకు అమిత్ థాక్రే హెచ్చరిక
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి






