Fact Check | కేంద్రం ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.46,715 జమ చేస్తుందా..?
Fact Check | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం భిన్నమైన పథకాలను ప్రవేశపెట్టి అందిస్తుంటాయి. వాటిల్లో భాగంగా కొన్ని పథకాలకు లబ్ధిదారులకు నేరుగా నగదును బదిలీ చేస్తారు. లబ్దిదారులకు అవసరమైన సహాయాన్ని కొన్ని సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రూపంలో కూడా అందిస్తాయి.
Fact Check | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం భిన్నమైన పథకాలను ప్రవేశపెట్టి అందిస్తుంటాయి. వాటిల్లో భాగంగా కొన్ని పథకాలకు లబ్ధిదారులకు నేరుగా నగదును బదిలీ చేస్తారు. లబ్దిదారులకు అవసరమైన సహాయాన్ని కొన్ని సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రూపంలో కూడా అందిస్తాయి. అయితే ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరస్థులు కేంద్రం ప్రవేశపెట్టిందని చెప్పి నగదును అందిస్తామని తెలియజేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలకు మెసేజ్‌లను పంపడం ద్వారా వాటిని వారు ఓపెన్ చేసేలా చేస్తున్నారు. దీంతో అది నిజమే అని నమ్ముతున్న చాలా మంది ఆయా లింక్‌లను ఓపెన్ చేసి వాటిల్లో వివరాలను నమోదు చేస్తున్నారు. ఆ తరువాత డబ్బు నష్టపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి నేరాలే అధికంగా జరుగుతున్నాయి. ఇక తాజాగా ఇలాంటిదే మరో మోసం వెలుగులోకి వచ్చింది.
రూ.46,715 జమ వాస్తవమేనా..?
కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతాలో రూ.46,715 జమ చేస్తుందని చెబుతూ కొందరు సైబర్ నేరస్థులు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పోస్టులను నిజమే అని నమ్ముతున్న చాలా మంది వాటిని క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నారు. వాటిల్లో అడిగిన విధంగా తమ వ్యక్తిగత సమాచారంతోపాటు బ్యాంకు వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ఆ తరువాత నేరస్థులు ఆ వివరాలతో ప్రజల ఖాతాల్లో ఉండే సొమ్మును దొంగిలిస్తున్నారు. ఇలా ప్రస్తుతం మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ సంస్థ కూడా నిజ నిర్దారణ చేసింది. కేంద్రం వాస్తవానికి అలాంటి స్కీమ్‌ను ఎక్కడా ప్రవేశపెట్టలేదని, అది పూర్తిగా అవాస్తవమని, ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.46,715 జమ చేస్తుందనే వార్త అబద్దమని స్పష్టం చేసింది. ఇలాంటి పోస్టులను నమ్మవద్దని హెచ్చరించింది. ఈమేరకు పీఐబీ తన ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టింది.
ఫిషింగ్ స్కామ్..
ఇలాంటి తప్పుడు వార్తలు ఫిషింగ్ స్కామ్ కిందకు వస్తాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా దుండగులు తప్పుడు వార్తలను ముందుగా ప్రచారం చేస్తారని, అందులో ఉండే లింక్‌లను క్లిక్ చేయగానే ప్రజల వివరాలను అడుగుతారని, తరువాత బ్యాంకు వివరాలను ఎంటర్ చేయాలని చెబుతారని, ఆ విధంగా ఎవరైనా చేస్తే వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో ఉండే నగదును దోచేస్తారని తెలిపారు. కనుక ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్ సైట్లు లేదా యాప్ లలోనే ఈ వివరాలను తెలుసుకుని ధ్రువీకరించుకోవాలని స్పష్టం చేశారు. ఫిషింగ్ స్కామ్‌ల వల్ల ప్రజలు డబ్బు నష్టపోవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత వివరాలనే కాకుండా బ్యాంకు వివరాలను కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ చెప్పవద్దని సూచించారు.
సంబంధిత వార్తలు

Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
జులై 9, 2026

Instagram | మెటాకు కేంద్రం నోటీసులు.. ఇన్‌స్టా యాడ్స్‌పై వివరణ కోరిన ఐటీశాఖ..!
జులై 3, 2026

SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా

Fact Check Elephant Saving Tiger | వరదల్లో పులిని కాపాడిన ఏనుగు : మూగ జీవాలకూ భావోద్వేగాలు.. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు



