త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Year Wishes Scam | మీకు ఫోన్‌లో న్యూ ఇయ‌ర్ విషెస్ ను ఎవ‌రైనా పంపించారా..? అయితే ఆగండి.. ముందు ఇది చ‌ద‌వండి..!

New Year Wishes Scam | నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చాలా మంది ఇప్ప‌టికే ఎలా పార్టీ చేసుకోవాలా అని ప్లాన్లు పూర్తి చేశారు. కొంద‌రు అదే ప్లానింగ్‌లో ఉన్నారు. ఇక కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టే త‌రుణంలో స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులు అంద‌రూ త‌మ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల‌కు న్యూ ఇయ‌ర్ శుభాకాంక్ష‌లు సైతం చెబుతుంటారు.

S

Technology | Published On Dec 31, 2025, 1.02 pm IST

New Year Wishes Scam | మీకు ఫోన్‌లో న్యూ ఇయ‌ర్ విషెస్ ను ఎవ‌రైనా పంపించారా..? అయితే ఆగండి.. ముందు ఇది చ‌ద‌వండి..!
Advertisement

New Year Wishes Scam | నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చాలా మంది ఇప్ప‌టికే ఎలా పార్టీ చేసుకోవాలా అని ప్లాన్లు పూర్తి చేశారు. కొంద‌రు అదే ప్లానింగ్‌లో ఉన్నారు. ఇక కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టే త‌రుణంలో స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులు అంద‌రూ త‌మ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల‌కు న్యూ ఇయ‌ర్ శుభాకాంక్ష‌లు సైతం చెబుతుంటారు. అందుకు గాను ప‌లు సందేశాలను, మెసేజ్‌లు, ఫొటోలు, జిఫ్ ఇమేజ్‌ల‌ను సైతం ఉప‌యోగిస్తుంటారు. అయితే అంతా బాగానే ఉంది కానీ న్యూ ఇయ‌ర్ విషెస్ చెప్పే క్ర‌మంలో అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌చ్చే సందేశాల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. న్యూ ఇయ‌ర్ విషెస్‌ను ఆస‌రాగా చేసుకుని సైబ‌ర్ నేరస్థులు మోసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల‌కు విషెస్ చెప్పే క్ర‌మంలో మెసేజ్‌ల‌లో లింకులు ఉండేలా చూస్తున్నార‌ని, దీంతో ఆ లింక్‌ల‌ను క్లిక్ చేసే యూజ‌ర్లు మోస‌పోతున్నార‌ని, డ‌బ్బు న‌ష్ట‌పోతున్నార‌ని, క‌నుక తెలియ‌ని వ్య‌క్తులు పంపించే మెసేజ్‌ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఓపెన్ చేయ‌వ‌ద్ద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

మెసేజ్‌ల ద్వారా మోసాలు..

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఎవ‌రైనా తెలియ‌ని వ్య‌క్తులు వాట్సాప్ లేదా ఇత‌ర మెసేజింగ్ యాప్‌లు, సోష‌ల్ మీడియా యాప్స్‌, ఎస్ఎంఎస్‌ల ద్వారా మెసేజ్‌ల‌ను పంపిస్తే వాటిని అస‌లు ఓపెన్ చేయ‌కూడ‌దు. ఎందుకంటే అలాంటి మెసేజ్‌లలో లింకులు ఉంటాయి. ఈ క్ర‌మంలో మెసేజే క‌దా అని ఓపెన్ చేస్తే అందులో ఉండే లింక్ క్లిక్ అయి అది కూడా ఓపెన్ అవుతుంది. దీంతో ఫోన్‌లో మ‌న‌కు తెలియ‌కుండానే హ్యాక‌ర్ల‌కు చెందిన యాప్స్ ఇన్‌స్టాల్ అవుతాయి. ఆ త‌రువాత ఆ యాప్స్ మ‌న ఫోన్ల‌ను ఆధీనంలోకి తీసుకుని ముఖ్య‌మైన బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డులు, ఈ-మెయిల్‌, పిన్ నంబ‌ర్లు, ఓటీపీలు, ఇత‌ర సున్నిత‌మైన స‌మాచారాన్ని హ్యాక‌ర్ల‌కు చేర‌వేస్తాయి. దీంతో వారు కొన్ని నిమిషాల్లోనే మన బ్యాంకు అకౌంట్ల‌లో ఉండే డ‌బ్బును కాజేస్తారు. క‌నుక న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఎవ‌రికైనా స‌రే తెలియ‌ని వ్య‌క్తుల నుంచి వ‌చ్చే మెసేజ్‌ల‌ను అస‌లు ఓపెన్ చేయ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు.

ఈ సూచ‌న‌లు పాటించాలి..

ఇక అపరిచిత వ్య‌క్తులు పంపే మెసేజ్‌ల‌ను ఓపెన్ చేయ‌కుండా వెంట‌నే డిలీట్ చేయ‌డంతోపాటు స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులు యాప్స్ ఇన్‌స్ట‌లేష‌న్ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్లే స్టోర్‌లో అందించే యాప్స్ కాకుండా ఇత‌ర వెబ్ సైట్లు, థ‌ర్డ్ పార్టీ స్టోర్స్‌, సామాజిక మాధ్య‌మాల్లో ల‌భించే యాప్స్‌, వాట్సాప్‌లో వ‌చ్చే యాప్స్‌ను కూడా ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇన్ స్టాల్ చేయ‌కూడ‌దు. అవన్నీ మాల్ వేర్‌ను క‌లిగి ఉంటాయి. మ‌న ఫోన్ ల‌ను హ్యాక్ చేసి స‌మాచారాన్ని దొంగిలిస్తాయి. క‌నుక కేవ‌లం గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్‌నే డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోన్ హ్యాకింగ్ కు గురైంద‌ని అనుమానం వ‌స్తే వెంట‌నే మొబైల్ డేటా, వైఫై, లొకేష‌న్ ను ఆఫ్ చేసి ఫోన్ ను ష‌ట్ డౌన్ చేయాలి. దీంతో మ‌రింత డేటా చోరీకి గురి కాకుండా ఉంటుంది. భారీ ఎత్తున న‌ష్టం క‌ల‌గ‌కుండా నివారించ‌వ‌చ్చు. ఈ విధంగా న్యూ ఇయ‌ర్ స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటే సైబ‌ర్ మెసాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement