Mega Special Puja | రూ.11 లక్షల మెగా స్పెషల్ పూజ.. చార్‌ధామ్‌లో పెరిగిన పూజా రుసుములు
Mega Special Puja | పవిత్ర చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (Badri-Kedar Temple Committee) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆలయాల్లో పూజా రుసుములను 5 నుంచి 10 శాతం వరకూ పెంచింది.
Mega Special Puja | పవిత్ర చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (Badri-Kedar Temple Committee) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆలయాల్లో పూజా రుసుములను 5 నుంచి 10 శాతం వరకూ పెంచింది. అలాగే రూ.11 లక్షల విలువైన ఒక ప్రత్యేకమైన మెగా స్పెషల్ పూజ (Mega Special Puja) కోసం ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది ప్రకటించారు.
దాతల నుంచి వచ్చే విరాళాలే ప్రధాన ఆలయ వనరులని కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు. పూజల ద్వారా వచ్చే నిధులను కమిటీ నిర్వహణ ఖర్చుల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. అంతేకాదు, ఈ ఏడాది ఆలయ కమిటీ 'మెగా స్పెషల్ పూజ' అనే ప్రత్యేక ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా అన్ని పూజా కార్యక్రమాలను కలిపి ఒకే ప్యాకేజీగా అందించనున్నట్లు తెలిపారు. అన్ని రకాల పూజలు చేయాలనుకునే భక్తులు సులభంగా, ఒకే చోట వాటిని పొందేలా దీనిని రూపొందించినట్లు వెల్లడించారు. దీని ధర సుమారు రూ. 11 లక్షలుగా నిర్ణయించినట్లు ద్వివేది ప్రకటించారు.
భగవంతునిపై ఉన్న ప్రగాఢ విశ్వాసంతో దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దాతలు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారని ద్వివేది తెలిపారు. వారు వివిధ రకాల పూజలు చేయాలని కోరుకుంటారని అయితే, ప్రతీ పూజకు విడివిడిగా బుక్ చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఇది యాత్రికులకు పెద్ద సమస్యగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే భక్తుల సౌకర్యార్థం అన్ని పూజలను ఓకే ప్యాకేజీలో పొందేలా 'మెగా స్పెషల్ పూజ' విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు.
భక్తుల రద్దీ తక్కువగా ఉండే రాత్రి సమయంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తు చేశారు. తిరుపతిలోని వేంకటేశ్వరుడి ఆలయంలో, వైష్ణో దేవి గుడిలో ఇలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని చెప్పారు. అందుకే భక్తుల కోసం కేదార్‌నాథ్‌లోనూ ఇలాంటి పూజా విధానాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు.
ఈ ఏడాది చార్‌ధామ్ (Chardham Yatra) యాత్ర ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. ఆ రోజున అక్షయ తృతీయన పురస్కరించుకుని యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరుస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 22న కేదార్‌నాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తారు. ఏప్రిల్ 23న ఉదయం 6.15 గంటలకు సంప్రదాయ ఆచారాల నడుమ బద్రీనాథ్ ఆలయ ద్వారాలను అధికారికంగా తెరుస్తారు.
Also Read..
బెదిరించి.. దబాయింపులతో తప్పించుకోలేరు.. మంత్రి సీతక్కపై గండ్ర వెంకటరమాణా రెడ్డి ఆగ్రహం
ఈక్విటీ మార్కెట్ల ప్రభావం.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
రాబోయే ఏడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువే.. ప్రజలు బయటకు రావొద్దు
సంబంధిత వార్తలు

Char Dham Yatra | చార్ ధామ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. ఇప్పటి వరకూ 12.62 లక్షల మంది పూజలు
మే 15, 2026

Kedarnath Dham | తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు.. హర హర మహాదేవ్ నామస్మరణలతో మార్మోగిన పుణ్యక్షేత్రం
ఏప్రిల్ 22, 2026

Kedarnath Dham | రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్ తలుపులు.. 51 క్వింటాళ్ల పూలతో ఆలయం ముస్తాబు
ఏప్రిల్ 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



