త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cough Syrup | 2 ఏళ్ల లోపు చిన్నారుల‌కు ఇక ద‌గ్గు సిర‌ప్‌లు నిషేధం.. ప‌రిశీలిస్తున్న కేంద్రం..

Cough Syrup | కేంద్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చిన్నారుల‌ ఆరోగ్య భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకోనుంద‌ని తెలుస్తోంది. 2 సంవత్సరాల లోపు పిల్లలకు పీడియాట్రిక్ దగ్గు సిరప్‌లను ప్రిస్క్రైబ్ చేయడాన్ని నిషేధించడంతోపాటు 5 ఏళ్ల లోపు చిన్నారుల‌కు వాటి వినియోగాన్ని త‌గ్గించ‌డంపై ఆలోచన చేస్తోంద‌ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

S

Health | Published On Apr 13, 2026, 11.47 am IST

Cough Syrup | 2 ఏళ్ల లోపు చిన్నారుల‌కు ఇక ద‌గ్గు సిర‌ప్‌లు నిషేధం.. ప‌రిశీలిస్తున్న కేంద్రం..
Advertisement

Cough Syrup | కేంద్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చిన్నారుల‌ ఆరోగ్య భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకోనుంద‌ని తెలుస్తోంది. 2 సంవత్సరాల లోపు పిల్లలకు పీడియాట్రిక్ దగ్గు సిరప్‌లను ప్రిస్క్రైబ్ చేయడాన్ని నిషేధించడంతోపాటు 5 ఏళ్ల లోపు చిన్నారుల‌కు వాటి వినియోగాన్ని త‌గ్గించ‌డంపై ఆలోచన చేస్తోంద‌ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఇండియ‌న్ ఫార్మాకోపియా క‌మిష‌న్ విడుదల చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా (NFI) 2026 ముసాయిదాలో భాగంగా వచ్చింది. గతేడాది కలుషిత ఔషధాల వల్ల చోటుచేసుకున్న మరణాల నేపథ్యంలో ప్రిస్క్రైబింగ్ విధానాల్లో దీన్నిఒక ముఖ్యమైన మార్పుగా భావిస్తున్నారు. అయితే ఈ నివేదికలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

ముసాయిదాను స‌మీక్షిస్తున్న ప‌రిశ్ర‌మ‌లు..

డ్రాఫ్ట్ NFI ప్రకారం ఔషధాల మోతాదు, వినియోగం, ప్రతికూల ప్రభావాలు వంటి అంశాలను ప్రమాణీకరించే ఈ మార్గదర్శకంలో స్పష్టంగా 2 సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ప్రిస్క్రైబ్ చేయకూడదు లేదా ఇవ్వకూడద‌ని పేర్కొంది. అదేవిధంగా 5 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఇలాంటి మందులను వైద్యుల జాగ్రత్తపూర్వక పరిశీలన, పర్యవేక్షణ లేకుండా ఇవ్వకూడదని తెలిపింది. అలాగే ఔషధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల్లో ఉపయోగించే ముడి పదార్థాలు, తుది ఉత్పత్తులను స్వయంగా పరీక్షించాల్సిన బాధ్యతను ఈ డ్రాఫ్ట్ స్పష్టంగా పేర్కొంది. సరఫరా వ్యవస్థ మొత్తం బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఇందులో ప్ర‌స్తావించారు. ఇండియ‌న్ డ్ర‌గ్స్ మానుఫాక్చ‌ర‌ర్స్ అసోసియేష‌న్ సహా పరిశ్రమ సంస్థలు ప్రస్తుతం ఈ ముసాయిదాను సమీక్షిస్తున్నాయి.

పారిశ్రామిక ర‌సాయ‌నాలు క‌లిసినందువ‌ల్లే..

గ‌తేడాదిలో క‌లుషిత లేదా ఎక్స్‌పైర్ అయిన ద‌గ్గు మందుల‌ను వాడి చిన్నారులు ప్రాణాల‌ను పోగొట్టుకున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ ముసాయిదాను విడుద‌ల చేసింది. గ‌తేడాది సంభ‌వించిన చిన్నారుల మ‌ర‌ణాల్లో చాలా మంది డైఎథిలీన్ గ్లైకాల్ (DEG), ఎథిలీన్ గ్లైకాల్ (EG) వంటి విషపూరిత పారిశ్రామిక రసాయనాలు లిక్విడ్ ఔషధాల్లో కలిసి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల మృత్యువాత ప‌డ్డారు. దీన్ని ఎదుర్కొనేందుకు ఇండియ‌న్ ఫార్మాకోపియా క‌మిష‌న్ గ్లిసరిన్, ప్రొపిలీన్ గ్లైకాల్, సోర్బిటాల్ ద్రావణం, లిక్విడ్ మాల్టిటాల్ వంటి హై రిస్క్ ఎక్సిపియెంట్లకు సంబంధించిన ప్రమాణాలను మార్చింది. ఈ పదార్థాల్లో DEG కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున కఠిన నియంత్రణలు అవసరమని పేర్కొంది.

ద‌గ్గు సిరప్ ప్ర‌యోజ‌నం అంతంత మాత్ర‌మే..

తయారీదారులు ఫార్మకోపీయల్-గ్రేడ్ ద్రావకాలను మాత్రమే ఉపయోగించాలి. అలాగే ప్రతి బ్యాచ్‌కు సంబంధించిన ముడి పదార్థాలు, తుది ఉత్పత్తులపై అనుమతించిన ప్రయోగశాలల్లో కచ్చితమైన పరీక్షలు నిర్వహించాలి. అన్ని వివరాలను సక్రమంగా నమోదు చేయడం కూడా తప్పనిసరి. ప్రజా ఆరోగ్య నిపుణులు, వైద్యులు ఈ చర్యను స్వాగతించారు. పిల్లల్లో దగ్గు సిరప్‌ల ప్రయోజనం చాలా పరిమితమని, కానీ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. దగ్గు శరీరానికి సహజ రక్షణ చర్య అని, దానిని అణచివేయడం కంటే అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయడం ముఖ్యమని వారు సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement