Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ప్రభావం.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలం అయిన నేపథ్యంలో ఆ ప్రభావం అంతర్జాతీయ, దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. మార్కెట్లు భారీగాపతనమై నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలం అయిన నేపథ్యంలో ఆ ప్రభావం అంతర్జాతీయ, దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. మార్కెట్లు భారీగాపతనమై నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. సోమవారం నాటి మార్కెట్ సెషన్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 32 డాలర్లు తగ్గి 4,717 వద్ద కొనసాగుతుండగా, వెండి ధర 1.56 డాలర్లు తగ్గి 74.35 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1040 పాయింట్లు (0.69 శాతం) పతనమై 1,51,607 వద్ద కొనసాగుతుండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 5,220 పాయింట్లు (2.15 శాతం) పతనమై 2,38,054 వద్ద ట్రేడవుతోంది. అలాగే దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,246 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21,968 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,460 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,24,600 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,800 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,975 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,800గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,97,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,434 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,472గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,340 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,43,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,900 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



