Women were beaten | కోర్టులో మహిళపై దాడి.. గొంతునులిమి దాడి చేసిన భర్త.. షాకింగ్ వీడియో
Women were beaten | కోర్టు ఆవరణలో లాయర్లు, పోలీసుల ముందే ఓ మహిళపై దాడి జరిగింది (Women were beaten). కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వెళ్లిన మహిళను ఆమె భర్త దారుణంగా కొట్టాడు. కిందపడేసి గొంతునులిమాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Women were beaten | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మహారాజ్‌గంజ్ (Maharajganj) ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లాయర్లు, పోలీసుల ముందే ఓ మహిళపై దాడి జరిగింది (Women were beaten). ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పురందర్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సమర్ధీరా చౌరాహా ప్రాంతానికి చెందిన ప్రియా త్రిపాఠి అనే మహిళకు మనీష్ కుమార్ మిశ్రాతో వివాహమైంది. అయితే, భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్తింటివారిపై ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే భరణం కోరుతూ ప్రియా కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నెల 24న కేసు విచారణ సందర్భంగా ప్రియ తన ఫ్యామిలీతో కలిసి కోర్టుకు వచ్చింది. ఆ సమయంలో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ప్రియపై దాడి చేశారు.
ప్రియ భర్త మనీష్ ఆమె జుట్టుపట్టుకుని కిందపడేసి దారుణంగా కొట్టాడు. ఆమె గొంతు నులిమాడు. పోలీసులు, లాయర్లు, పబ్లిక్ చూస్తుండగానే దాడి చేశాడు. ఈ ఘటనపై ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టులో కేసు కొనసాగిస్తే చంపేస్తామంటూ బెదిరించినట్లు పేర్కొంది. సాక్ష్యంగా దాడి ఘటనకు సంబంధించిన వీడియోని కూడా సమర్పించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Inside court premises in Maharajganj, Uttar Pradesh. Women were beaten and tossed like an object infront of police and lawyers. pic.twitter.com/g3mZBkNSuK
— Piyush Rai (@Benarasiyaa) September 26, 2026
Also Read..
దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
హైదరాబాద్‌లో 'పూంపుహార్' మెగా హస్తకళల ప్రదర్శన
అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి
- ●Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Minister Seethakka | రూ.1000 కోట్లతో 5118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క
- ●Minister Vivek | మెదక్‌లో రూ. 100 కోట్లతో పబ్లిక్ స్కూల్

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్

Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం

House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!






