త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | నేత కార్మికుల‌కు అండ‌గా ఉంటాం : మంత్రి పొన్నం

Ponnam Prabhakar | రాష్ట్రంలోని ప్రతి నేత కార్మికుడికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు. ప్రత్యేకంగా సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలపై సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.

S

Telangana | Published On Sep 26, 2026, 5.57 pm IST

Ponnam Prabhakar | నేత కార్మికుల‌కు అండ‌గా ఉంటాం : మంత్రి పొన్నం
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని ప్రతి నేత కార్మికుడికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు. ప్రత్యేకంగా సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలపై సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో కూడా నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అండగా నిలిచాన‌ని పొన్నం గుర్తు చేశారు. ఈ నెల 30న సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పొన్నం ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి ఈ నెల 30వ తేదీన కరీంనగర్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా 33 నెలల ప్రజాపాలనలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. “చలో సిరిసిల్ల” పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నామ‌ని పొన్నం తెలిపారు.

Advertisement
Advertisement