Kunal Ghosh | దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
Kunal Ghosh | పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) తృణమూల్ నేత, ఎమ్మెల్యే కునాల్ ఘోష్ (Kunal Ghosh) కారుపై దాడి జరిగింది. మమతా బెనర్జీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయన కారుపై ఆందోళనకారులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు.
Kunal Ghosh | త్రినేత్ర న్యూస్ : పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ (Mamata Banerjee) వర్గం నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హుగ్లీ (Hooghly)లో తృణమూల్ నేత, ఎమ్మెల్యే కునాల్ ఘోష్ (Kunal Ghosh) కారుపై దాడి జరిగింది. మమతా బెనర్జీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఓ గుంపు మార్గం మధ్యలో ఆయన కారును అడ్డగించింది. కారును చుట్టుముట్టి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసింది.
కునాల్ ఘోష్ కారులోనే కూర్చుని ఉండగా.. ఆందోళనకారులు కారుపైకి ఎక్కి బీభత్సం సృష్టించారు. కునాల్ ఘోష్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఎమ్మెల్యే కోల్‌కతాకు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు దాడి ఘటనపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. రాళ్లు, కోడిగుడ్లతో తన కారుపై దాడి చేసి రోడ్డును దిగ్బంధించినట్లు చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఒక్క పోలీసు సిబ్బంది కూడా లేరని ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
Also Read..
సీఈసీ రాజీనామాకు డిమాండ్.. సెప్టెంబర్ 30న ఇండీ కూటమి కీలక భేటీ
జనగామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
- ●Duronto Express Stone Pelting | పట్టాలపై దారుణం: దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. భోజనం చేస్తున్న ప్రయాణికుల పక్కనే పగిలిన కిటికీ అద్దాలు
- ●Chamala Kirankumar | జనగామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
- ●e-Pindaan | ఆన్లైన్లోనే పితృకార్యాలు.. కాశీలో ఈ-తర్పణ్..!
- ●UPI Payment Splitting Risk | చార్జీలు తప్పించుకునేందుకు ఒకే బిల్లును పదే పదే రూ.2000 చొప్పున స్ప్లిట్ చేసి పేమెంట్ చేయొచ్చా?
- ●DGP CV Anand | గణేశ్ నిమజ్జనాల్లో అపశృతి.. 13 మంది మృతి : డీజీపీ సీవీ ఆనంద్

Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్

Duronto Express Stone Pelting | పట్టాలపై దారుణం: దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. భోజనం చేస్తున్న ప్రయాణికుల పక్కనే పగిలిన కిటికీ అద్దాలు

Chamala Kirankumar | జనగామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

e-Pindaan | ఆన్లైన్లోనే పితృకార్యాలు.. కాశీలో ఈ-తర్పణ్..!






