త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Property | మ‌రో మ‌హిళ‌కు ఆస్తి రాసిస్తాడ‌ని.. తండ్రిని చంపిన కొడుకు

Property | త్రినేత్ర న్యూస్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో (Kanpur) దారుణం చేసుకుంది. మరో మ‌హిళ‌కు ఆస్తి (Property) రాసిస్తాడ‌నే అనుమానంతో తండ్రి గొంతుకోసి చంపేశాడు కొడుకు. కాన్పూర్‌కు చెందిన వినీత్ మినోచా (60) ఒక ఫార్మ‌స్యూటిక‌ల్ వ్యాపారి (Pharmaceutical Trader).

G

National | Published On Sep 25, 2026, 10.29 am IST

Property | మ‌రో మ‌హిళ‌కు ఆస్తి రాసిస్తాడ‌ని.. తండ్రిని చంపిన కొడుకు
Advertisement

Property | త్రినేత్ర న్యూస్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో (Kanpur) దారుణం చేసుకుంది. మరో మ‌హిళ‌కు ఆస్తి (Property) రాసిస్తాడ‌నే అనుమానంతో తండ్రి గొంతుకోసి చంపేశాడు కొడుకు. కాన్పూర్‌కు చెందిన వినీత్ మినోచా (60) ఒక ఫార్మ‌స్యూటిక‌ల్ వ్యాపారి (Pharmaceutical Trader). భార్య చ‌నిపోవ‌డంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఆయ‌న‌కు కుమారుడు సుబ్ర‌త్ మినోచా (Subrat Minocha), కోడ‌లు శాలు ఉన్నారు. సెప్టెంబ‌ర్ 5న కొడుకు, కోడ‌లు ఓ పార్టీకి వెళ్లడంతో.. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న‌ వినీత్‌ను దుండ‌గులు గొంతు కోసి దారుణంగా హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ప్రాథ‌మిక విచార‌ణలో కోడ‌లు శాలును సూత్ర‌ధారిగా భావించిన‌ పోలీసులు.. ఆమెతోపాటు వారి మాజీ ఉద్యోగి విశాల్ గౌతమ్, అతని సహచరుడు రాజ్‌కిషోర్‌లను అరెస్ట్ చేశారు.

అయితే, తదుపరి విచారణలో నిందితుడు విశాల్ గౌత‌మ్‌.. వినీత్ కుమారుడు సుబ్రత్‌తో త‌ర‌చూ ఫోన్‌లో మాట్లాడిన‌ట్లు గుర్తించారు. దీని ఆధారంగా ఈనెల‌ 23న అత‌డిని కూడా అరెస్టు చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తన తండ్రికి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఆయన మరొక మహిళతో కలిసి జీవిస్తూ తన ఆస్తినంతా ఆమె పేరుతో రాస్తాడ‌నే భయంతో హత్యకు ప్లాన్ చేసినట్లు అంగీకరించాడు. మొదట ఈ మరణాన్ని ప్రమాదవశాత్తు లేదా సహజ మరణంగా చిత్రీకరించాలని భావించినప్పటికీ, ఆ తర్వాత ప్లాన్ మార్చినట్లు తెలిపాడు. తండ్రిని చంపేందుకు విశాల్‌కు రూ.6 ల‌క్ష‌లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాన‌ని చెప్పాడు. కాగా, ఇద్ద‌రూ క‌లిసి పోలీసుల దృష్టిని శాలు (కోడలు) వైపు మళ్లించడానికి ప్రయత్నించారని పోలీసులు వెల్ల‌డించారు. సుబ్రత్ ఖర్చుల కోసం అతని తండ్రి ప్రతి నెలా రూ.40 వేలు ఇచ్చేవాడని, అయితే అత‌డు మాత్రం నెలకు దాదాపు రూ.55 వేల‌ లోన్ ఈఎంఐలు చెల్లిస్తున్నాడ‌ని తెలిపారు.

Advertisement
Advertisement