Minister Vivek | మెదక్‌లో రూ. 100 కోట్లతో పబ్లిక్ స్కూల్
Minister Vivek | మెదక్‌లో 2,500 మంది విద్యార్థుల కోసం యంగ్ ఇండియా స్కూల్‌ను వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించనున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్‌కు రూ.100 కోట్లతో పబ్లిక్ స్కూల్ కూడా మంజూరైంది అని ఆయన తెలిపారు.
కేంద్రీకృత కిచెన్ ప్రారంభం సందర్భంగా మంత్రి వివేక్ వెల్లడి
Minister Vivek | త్రినేత్ర న్యూస్ : మెదక్‌లో 2,500 మంది విద్యార్థుల కోసం యంగ్ ఇండియా స్కూల్‌ను వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించనున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్‌కు రూ.100 కోట్లతో పబ్లిక్ స్కూల్ కూడా మంజూరైంది అని ఆయన తెలిపారు. మెదక్ పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో నూతనంగా నిర్మించిన కేంద్రీకృత కిచెన్‌ను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.

కేంద్రీకృత కిచెన్‌లో ఏర్పాటు చేసిన యంత్రాలను పరిశీలించి, వాటి సామర్థ్యం గురించి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం వడ్డించి, వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. అల్పాహారం నాణ్యత, రుచి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని అమలు చేస్తున్నాము. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడంలో సహకరిస్తున్న హరే కృష్ణ మూవ్‌మెంట్ బృందానికి ధన్యవాదాలు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలి. ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, చేరికలు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

తెలంగాణలో 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహార పథకం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాము, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం అందుతోంది. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు కొత్తగా ఏటీసీ సెంటర్‌ను ప్రారంభించాం, శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివేక్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు
- ●Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు

Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్




