Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
Ponnam Prabhakar | రాష్ట్రంలోని కుల వృత్తిదారులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కులవృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ అందించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని కుల వృత్తిదారులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కులవృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ అందించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.
కరీంనగర్ ఇందిరా భవన్‌లో జరిగిన జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం తొలి మహాసభలో సహచర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ చైర్మన్‌లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సరితా తిరుపతయ్య యాదవ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చరణ్ కౌశిక్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కులవృత్తులకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని, గొర్రెల పెంపకందారులకు బీమా, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, పశువైద్య సేవలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకానికి ప్రభుత్వ భూములను వినియోగించే అంశాన్ని పరిశీలించాలని కోరడం జరిగిందన్నారు. మన పిల్లల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, ప్రతి కుటుంబం పిల్లలను బాగా చదివించాలని సూచించారు. కులవృత్తులను బలోపేతం చేసి, గ్రామీణ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
- ●KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు
- ●Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం

Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం

Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు

Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు





