Minister Seethakka | రూ.1000 కోట్లతో 5118 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క
Minister Seethakka | రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు స్యాచురేషన్ మోడ్‌లో పంచాయతీ భవనాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో సొంత భవనాలు లేని 5,118 గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు.
Minister Seethakka | రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు స్యాచురేషన్ మోడ్‌లో పంచాయతీ భవనాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో సొంత భవనాలు లేని 5,118 గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇప్పటికే 3,269 భవనాల పనులు 70 శాతం మేర పూర్తయ్యాయని.. మిగిలిన పనులను కూడా ఈ ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
8వేల గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు
గ్రామ పంచాయతీ భవనాలతో పాటు రాష్ట్రంలోని 8 వేల గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలను నిర్మిస్తున్నామని సీతక్క తెలిపారు. ఇందుకోసం రూ.800 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు అందుబాటులోకి వస్తే తమ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామీణ రహదారులను హ్యామ్ విధానంలో నిర్మిస్తున్నామని సీతక్క తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని గ్రామీణ రహదారుల నిర్మాణానికి వినియోగిస్తున్నామని చెప్పారు. హ్యామ్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 3,861 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మిస్తున్నామని, ఇందుకోసం సుమారు రూ.3,382 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత హ్యామ్ రహదారుల్లో దాదాపు సగం ఈ నాలుగు జిల్లాల్లోనే ఉన్నందున అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అక్టోబర్ నుంచి జూన్ వరకు నిర్మాణ పనులకు అనువైన సమయమని.. ఈ కాలాన్ని పూర్తిగా వినియోగించుకుని పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతి ఆవాసం నుంచి రాష్ట్ర రాజధానికి మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన అని సీతక్క తెలిపారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ రహదారులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
తాగునీటిపై ముందస్తు చర్యలు
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీతక్క ఆదేశించారు. ఈ నాలుగు జిల్లాల్లోని 19 రిజర్వాయర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. సింగూరు మినహా మిగిలిన రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు. సింగూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేనందున ప్రత్యేక అధికారిని నియమించి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. నిజాంసాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించే చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం సింగూరులో సుమారు 54 రోజులకు సరిపడా తాగునీటి నిల్వలు ఉన్నాయని, స్థానిక నీటి వనరులను వినియోగించుకోవడం ద్వారా సుమారు 75 రోజుల వరకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి మండలానికి ముగ్గురు సభ్యులతో డ్రింకింగ్ వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలు మండలాల్లో పర్యటించి నీటి లభ్యతను అంచనా వేయడంతోపాటు ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలని సూచించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాలు, చెంచు పెంటల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పనులు పెంచాలి
వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ పనులు తగ్గే అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పనులు కల్పించాలని సీతక్క సూచించారు. ఉపాధి హామీ పనుల కోసం రూ.6 వేల కోట్ల బడ్జెట్ సిద్ధంగా ఉందని.. గ్రామాల్లో మౌలిక వసతులు, నీటి సంరక్షణ పనులు చేపట్టి నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు. జలసిరి కార్యక్రమం కింద చేపట్టిన నీటి సంరక్షణ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మంచిగా పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘాల భవనాలు, రహదారులు, తాగునీరు, ఉపాధి హామీ, నీటి సంరక్షణ పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rajanna Sircilla | సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
సెప్టెంబర్ 26, 2026

Trains Cancelled | రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
సెప్టెంబర్ 26, 2026

Jagadeesh Reddy | నల్లగొండలో పవర్ ప్లాంట్ వద్దనేవాడిని చెప్పుతో కొట్టాలి
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి
- ●Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Minister Vivek | మెదక్‌లో రూ. 100 కోట్లతో పబ్లిక్ స్కూల్
- ●Rajanna Sircilla | సీఎం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
- ●Devi Prasad | దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి

Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం

House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

Priyanka Jain | బిగ్‌బాస్ బ్యూటీ హార్స్ రైడింగ్ - క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!

Minister Vivek | మెదక్‌లో రూ. 100 కోట్లతో పబ్లిక్ స్కూల్



