Konda Surekha | కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. కడియంపై హైకమాండ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు
Konda Surekha | కాంగ్రెస్‌లో అంతర్గత వివాదాలు మళ్లీ భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కడియంపై కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్‌కు కొండా సురేఖ మరోసారి ఫిర్యాదు చేశారు.
Konda Surekha | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్‌లో అంతర్గత వివాదాలు మళ్లీ భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కడియంపై కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్‌కు కొండా సురేఖ మరోసారి ఫిర్యాదు చేశారు. ఆయన వ్యవహార శైలిపై లేఖ రాశారు. అయితే ఇటీవల వారిద్దరి మధ్య కుదిరిన రాజీకి మళ్లీ బ్రేక్ పడినట్టేనా? అన్న చర్చ పార్టీ నాయకుల్లో జోరందుకుంది. ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.
కాగా నిన్న స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంపై కడియం హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఎండోమెంట్ సమీక్ష నిర్వహించారు. రివ్యూ అనంతరం ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. అయితే జిల్లా వ్యవహారాల్లో కడియం జోక్యం చేసుకోవడంపై కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తనకు తెలియకుండా ఎలా రివ్యూ చేస్తారని ఆమె మండిపడ్డారు. అయితే ఆమె ఫిర్యాదుపై అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
మహేశ్‌కుమార్ గౌడ్ ఆరా..
కడియంపై స్టేట్ కమాండ్‌కి కాకుండా నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సురేఖ ఫిర్యాదుపై ఆయన ఆరా తీశారు. హైకమాండ్‌కు రాసిన లేఖను బయటపెట్టొద్దని ఆమెకు పీసీసీ చీఫ్ సూచించినట్లు సమాచారం. గతంలో ఇలాంటి వివాదమే తలెత్తగా మళ్లీ మంత్రి హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సంబంధిత వార్తలు

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
జులై 19, 2026

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
జులై 19, 2026

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
జులై 19, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
- ●HMDA | వాహనదారులకు గుడ్‌న్యూస్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం

Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్



