Rashmika Mandanna | నాలుగోసారి జోడీ కుదిరిందా? – విజయ్, రష్మిక కాంబోలో బాలీవుడ్ మూవీ !
టాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో ఫస్ట్ టైమ్ ఓ బాలీవుడ్ మూవీ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ హిందీ మూవీ ఫిక్సయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
Entertainment | Published On Jul 7, 2026, 2.41 pm IST
Rashmika Mandanna | టాలీవుడ్ రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో నాలుగో మూవీ రానుందా? ఫస్ట్ టైమ్ వీరిద్దరు కలిసి ఓ బాలీవుడ్ మూవీ చేయనున్నారా? అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లిపీటలు ఎక్కారు ఈ జంట. ప్రస్తుతం విజయ్, రష్మిక కలయికలో రణబాలి సినిమా తెరకెక్కుతోంది. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటీషర్లను ఎదురించి పోరాడిన రాయలసీమకు చెందిన రణబాలి అనే యోధుడిగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. జయమ్మ అనే డీ గ్లామర్ క్యారెక్టర్‌లో రష్మిక నటిస్తోంది. ఈ సినిమాలోనూ వీరిద్దరు భార్యాభర్తలుగానే నటిస్తున్నారు.
రణబాలి రిలీజ్‌కు ముందే...
రణబాలి రిలీజ్ కాకముందే విజయ్, రష్మిక మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సారి తెలుగులో కాకుండా ఓ బాలీవుడ్ మూవీలో వీరిద్దరు జంటగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీ రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ మాడక్ ఫిల్మ్స్ నిర్మించబోతుంది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియన్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
కృతి సనన్, జాన్వీ కపూర్...
ఈ భారీ బడ్జెట్ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరు తెరపైకి వచ్చింది. తొలుత కృతి సనన్, శార్వరి, జాన్వీ కపూర్‌తో పాటు మరికొందరు హీరోయిన్ల పేర్లను మేకర్స్ పరిశీలించినట్లు తెలిసింది. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ప్రధానంగా సాగే కథ కావడంతో వారికంటే రష్మికనే బెటర్ అని మేకర్స్ ఫిక్సైనట్లు సమాచారం. రియల్ లైఫ్‌లో వీరిద్దరు మధ్య ఉన్న బంధం కూడా కథకు ప్లస్సవుతుందని టాక్ . అంతే కాకుండా రష్మికకు బాలీవుడ్‌లో ఉన్న సక్సెస్ ట్రాక్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని నేషనల్ క్రష్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు సమాచారం.
నాలుగో మూవీ...
విజయ్, రష్మిక కలయికలో వస్తోన్న నాలుగో మూవీ ఇది. త్వరలోనే ఈ బాలీవుడ్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విజయ్ రణబాలితో పాటు రౌడీ జనార్ధన సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ మైథాలజీ మూవీకి ఓకే చెప్పాడు. మరోవైపు రష్మిక రణబాలితో పాటు మైసా పేరుతో తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బిజీగా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | రణబాలి అప్డేట్ లీక్ చేసిన రష్మిక – ఇన్‌స్టా పోస్ట్ వైరల్
జులై 12, 2026

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
జులై 12, 2026

Rashmika Mandanna | మైసా కోసం నేషనల్ క్రష్ సాహసం – డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్
జులై 9, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



