త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | కేటీఆర్.. మ‌రి తొమ్మిదిన్న‌రేండ్ల‌లో ఏం చేశారు..?

Mahesh Kumar Goud | రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్టును వారం రోజులు అప్ప‌గిస్తే.. తెలంగాణ అంత‌టికీ నీళ్లు పారిస్తామ‌న్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరాన్ని వారం అప్పగిస్తే నీళ్లు ఇస్తాం అని చెబుతున్న కేటీఆర్ తొమ్మిదిన్నర ఏండ్లలో ఏమి చేశారో చెప్పాలి అని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jul 7, 2026, 2.25 pm IST

Mahesh Kumar Goud | కేటీఆర్.. మ‌రి తొమ్మిదిన్న‌రేండ్ల‌లో ఏం చేశారు..?
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్టును వారం రోజులు అప్ప‌గిస్తే.. తెలంగాణ అంత‌టికీ నీళ్లు పారిస్తామ‌న్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరాన్ని వారం అప్పగిస్తే నీళ్లు ఇస్తాం అని చెబుతున్న కేటీఆర్ తొమ్మిదిన్నర ఏండ్లలో ఏమి చేశారో చెప్పాలి అని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. మ‌హేశ్ కుమార్ గౌడ్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత‌లు ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్ప‌డింది. తానే పెద్ద ఇంజినీర్‌గా వ్య‌వ‌హరించి, అస‌లైన ఇంజినీర్ల మాట‌లు విన‌క‌పోవ‌డం వ‌ల్లే కాళేశ్వ‌రం కూళేశ్వ‌రంగా మారింది. కేసీఆర్ నియంతృత్వ పోకడలతో కాళేశ్వరం నాణ్యత దెబ్బ‌తిన‌డంతో పాటు వారి అవినీతితో ప్రాజెక్టుకే ముప్పు ఏర్ప‌డింది అని మ‌హేశ్ కుమార్ ధ్వ‌జ‌మెత్తారు.

కేటీఆర్ కూడా అదే అహంభావం

వర్షాభావంతో నీళ్లు లేని సమయంలో సముద్రంలోకి నీళ్లు వదులుతున్నారంటూ కేటీఆర్ చేస్తున్న ప్రకటనలు ఆయన అనుభవ రాహిత్యానికి నిదర్శనం. అవినీతితో కాళేశ్వ‌రాన్ని కేసీఆర్ ప్రభుత్వం కూల్చివేస్తే దాన్ని కాంగ్రెస్ కాపాడుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల నాణ్యత అనుమానాస్పదంగా ఉన్నాయనే వాస్తవం కేటీఆర్‌కు తెలియదా..? నాణ్యతా లోపంతో ఉన్న ప్రాజెక్టులో పంపులు ఆన్ చేస్తే ఏమవుతుందో కేటీఆర్‌కు తెలియదా..? గతంలో కేసీఆర్ కూడా తాను ఇంజినీరు అంటూ గొప్పలకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లేకుండా చేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అహంభావంతో అవగాహన లేకుండా పంపులు ఆన్ చేయమని అంటున్నారు అని ఆయ‌న మండిప‌డ్డారు.

నీటిని నిల్వ చేయడం అశాస్త్రీయం.. ప్రమాదకరం..

ఎన్డీఎస్ఏ, సీడ‌బ్ల్యూసీ అనుమతులు లేకుండా బ్యారేజీలు నిర్వహించడం ప్రజల ప్రాణాలతో చెల‌గాటం ఆడ‌డ‌మే. బ్యారేజీ పైపింగ్, పునాదుల్లో ఎన్డీఎస్ఏ లోపాల‌ను గుర్తించింది. వాటిని సరి చేయకుండా నీటిని నిల్వ చేయడం అశాస్త్రీయం.. ప్రమాదకరం. త్వరలోనే సాంకేతిక పరీక్షలతో ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు, ప్రజాధానాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభత్వం ప్రాధాన్యతిస్తుంది. మీ లాగా హడావుడి నిర్ణయాలు తీసుకొని అశాస్త్రీయమైన పనులు చేపట్టం. వారం రోజుల్లో నీళ్లు ఇస్తామంటున్న కేటీఆర్, తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అక్రమాలపై పశ్చాతపం వ్యక్తం చేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రజలు బీఆర్ఎస్ నేతలను తరిమి కొట్టడం ఖాయం అని మ‌హేశ్ కుమార్ గౌడ్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement