IndiGo | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. ప్రయాణికుల్లో టెన్షన్
IndiGo | గోవా నుంచి ఢిల్లీ బయల్దేరిన ఇండిగో (IndiGo) విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని గోవాకు మళ్లించారు. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
IndiGo | త్రినేత్ర.న్యూస్ : ఇండిగో (IndiGo) విమానానికి పెను ప్రమాదం తప్పింది. గోవా నుంచి ఢిల్లీ బయల్దేరిన (Goa To Delhi flight) విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య తలెత్తింది (mid air engine failure). అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే గోవాకు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
ఇండిగోకు చెందిన 6E 2102 విమానం ఇవాళ ఉదయం 9:16 గంటల సమయంలో గోవా ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయ్యింది. విమానం సుమారు 14 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని ఏటీసీ అనుమతితో గోవాకు మళ్లించారు. దీంతో ఉదయం 9:30 గంటల సమయంలో ఏటీసీ గోవా ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. 9:51 గంటలకు విమానం రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఆ సమయంలో విమానంలో సుమారు 220 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. తాజా పరిస్థితితో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, గోవా ఎయిర్‌పోర్టులో విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని మధ్యాహ్నం 3:30 గంటలకు రీషెడ్యూల్ చేశారు.
Also Read..
వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు.. సీఎన్‌జీ, జెట్ ఇంధన ధరలూ పెంపు
నేపాల్ జలవిలయం.. 1000 దాటిన మృతులు.. 4000 మంది మిస్సింగ్
విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు వద్దు.. జీడీపీ వృద్ధిపై దేశ ప్రజలకు ప్రధాని అభినందనలు
సంబంధిత వార్తలు

IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన
సెప్టెంబర్ 4, 2026

IndiGo | విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్.. ప్రయాణికుల్లో టెన్షన్
ఆగస్టు 12, 2026

IndiGo flight | విమానం గాల్లో ఉండగా పొగలు.. ప్రయాణికుల్లో టెన్షన్.. టెన్షన్
జులై 27, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



