IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..
IndiGo | దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన ప్రయాణికులకు షాకిచ్చింది. విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలు భారీగా పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన ఛార్జీలను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 6, మంగళవారం తెల్లవారుజామున 12:01 గంటల తర్వాత చేసే అన్ని కొత్త బుకింగ్‌లకు ఈ సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి.
IndiGo | దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తన ప్రయాణికులకు షాకిచ్చింది. విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలు భారీగా పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన ఛార్జీలను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 6, మంగళవారం తెల్లవారుజామున 12:01 గంటల తర్వాత చేసే అన్ని కొత్త బుకింగ్‌లకు ఈ సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. దేశీయ విమానాల్లో ప్రయాణించే దూరాన్ని బట్టి అదనపు ఇంధన ఛార్జీ రూ.375 నుంచి రూ.1,300 వరకు ఉంటుంది. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి రూ.375, 501 నుంచి 1,000 కిలోమీటర్ల వరకు రూ.600, 1,001 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు రూ.900, 1,501 నుంచి 2,000 కిలోమీటర్ల వరకు రూ.1,150, 2,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణానికి రూ.1,300 ఇంధన ఛార్జీ వసూలు చేయనుంది.
అంతర్జాతీయ విమానాల్లో భారీగానే..
అంతర్జాతీయ విమానాల విషయానికి వస్తే సవరించిన ఇంధన ఛార్జీలు రూ.1,000 నుంచి రూ.10వేల వరకు ఉండనున్నాయి. అంటే ప్రయాణించే మార్గం, దూరాన్ని బట్టి టికెట్ ధరపై అదనపు భారం పడనుంది. ఇటీవలి నెలల్లో విమాన ఇంధనం ఏటీఎఫ్ ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని ఇండిగో తెలిపింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలపై ప్రభావం పడుతోందని పేర్కొంది. నెలవారీగా ఏటీఎఫ్ ధరలు 14 శాతానికి పైగా పెరగడంతో గత దశాబ్దంలోనే అత్యధిక స్థాయిలకు చేరుకున్నాయని తెలిపింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ కీలకమైన వాటాను కలిగి ఉంటుందని ఇండిగో పేర్కొంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల విమానయాన సంస్థల వ్యయ నిర్మాణం, వివిధ మార్గాల్లో విమానాల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన ఛార్జీలను పునఃసమీక్షించి పెంచాల్సి వచ్చిందని వెల్లడించింది.
పెరుగుతున్న ఇంధన ధరలే కారణం..
మరోవైపు మధ్యప్రాచ్య ఘర్షణలు ఏడు నెలలకు పైగా కొనసాగుతుండడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ఆందోళన కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, ఘర్షణల ప్రారంభ దశలో నమోదైన బ్యారెల్‌కు 126 డాలర్ల స్థాయితో పోలిస్తే ప్రస్తుతం ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఇండిగో ఇటీవల కూడా ప్రయాణికులపై పలు అదనపు ఛార్జీలను పెంచింది. సెప్టెంబర్‌లో శిశువులతో ప్రయాణించే వారికి, తల్లిదండ్రులు లేకుండా ప్రయాణించే మైనర్లకు, అదనపు సామానుకు సంబంధించిన పలు సేవల ఛార్జీలను సవరించింది. దేశీయ విమానాల్లో శిశువుతో ప్రయాణించే ఛార్జీని రూ.2,200 నుంచి రూ.3,000కు పెంచింది. అంతర్జాతీయ విమానాల్లో ఈ ఛార్జీ మార్గాన్ని బట్టి మారుతుంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేకుండా ప్రయాణించే మైనర్లకు దేశీయ విమానాల్లో రూ.5,999, అంతర్జాతీయ విమానాల్లో రూ.12,999 వరకు ఛార్జీని ఇండిగో వెబ్‌సైట్‌లో పేర్కొంది. అదేవిధంగా ఫాస్ట్-ఫార్వర్డ్ సేవకు రూ.650, ప్రయాణ ధ్రువీకరణ పత్రానికి రూ.300 ఛార్జీ వసూలు చేస్తోంది. తాజా ఇంధన ఛార్జీల పెంపుతో ఇండిగో విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులపై టికెట్ ధరకు అదనంగా మరింత భారం పడనుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..
- ●Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?
- ●CEC Gyanesh Kumar | జ్ఞానేశ్ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
- ●Maruti Suzuki | మారుతి షేర్లకు భారీ కరెక్షన్.. 34 శాతం పతనం తర్వాత మళ్లీ పుంజుకుంటుందా?
- ●Supreme Court | నేరస్థుల్లో భయం పుట్టించాలి.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..

Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?

CEC Gyanesh Kumar | జ్ఞానేశ్ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్






