త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Farmer Alleges | గజ్వేల్‌లో మ‌రో రైతుకు అవ‌మానం.. ఎస్ఐ మ‌ల్లారెడ్డి కొట్టారంటూ రైతు ఆరోపణలు

Farmer Alleges | ఇటీవ‌ల గ‌జ్వేల్ ఎంఆర్‌వో స్వామి వ్య‌వ‌హారం మ‌ర‌వ‌క‌ముందే శుక్ర‌వారం మ‌రో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది.

S

Telangana | Published On Oct 23, 2026, 10.32 pm IST

Farmer Alleges | గజ్వేల్‌లో మ‌రో రైతుకు అవ‌మానం.. ఎస్ఐ మ‌ల్లారెడ్డి కొట్టారంటూ రైతు ఆరోపణలు
Advertisement
  • రక్తం వచ్చేలా కొట్టారంటూ ఆవేదన

Farmer Alleges | త్రినేత్ర న్యూస్: ఇటీవ‌ల గ‌జ్వేల్ ఎంఆర్‌వో స్వామి వ్య‌వ‌హారం మ‌ర‌వ‌క‌ముందే శుక్ర‌వారం మ‌రో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. త‌న‌ను ఎస్ఐ మ‌ల్లారెడ్డి కొట్టారంటూ ఓ రైతు తీవ్ర ఆరోప‌ణ‌లు (Farmer Alleges) చేయ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. బీమరి రవి (35), తండ్రి యాదయ్య, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన వ్యవసాయ పొలంలో పంట సాగు విషయంలో పొరుగువారితో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తనపై ఎస్ఐ మల్లారెడ్డి ఎలాంటి కారణం లేకుండానే దాడి చేశారని, రక్తం వచ్చేలా కొట్టారని బాధితుడు ఆరోపించాడు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే తనపై చేయి చేసుకున్నారని వాపోయాడు. పైగా పీక‌నీకి చేస్తున్న‌వా వ్య‌వ‌సాయం అంటూ అవ‌మానించార‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు.

ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని బాధితుడు కోరుతున్నట్లు తెలుస్తోంది. స్టేషన్‌లో అసలు ఏం జరిగింది? రైతుపై దాడి జరిగిందా? జరిగితే అందుకు కారణాలేమిటి? బాధితుడి ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలు విచారణలో తేలాల్సి ఉంది.

ఒకవైపు రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్న వేళ.. మరోవైపు న్యాయం కోసం వచ్చిన రైతు పోలీసులపైనే ఆరోపణలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. రైతులు తమ సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే పరిస్థితులు ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement