Indias nuclear arsenal | భారత్ వద్ద 190 అణు వార్‌హెడ్స్
Indias nuclear arsenal | భారత్ తన అణుశక్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ నివేదించింది. ప్రస్తుతం భారత్ వద్ద దాదాపు 190 అణు వార్‌హెడ్‌లు (Indias nuclear arsenal) ఉన్నట్లు అంచనా వేసింది.
Indias nuclear arsenal | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అన్ని దేశాలు తమ సైనిక, రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అణ్వాయుధ సామర్థ్యాన్నిమరింతగా పెంచుకుంటున్నాయి. ఈ విషయంలో మన దేశం (India) కూడా ముందుంది. చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలతో పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో భారత్ తన అణుశక్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ నివేదించింది. ప్రస్తుతం భారత్ వద్ద దాదాపు 190 అణు వార్‌హెడ్‌లు (190 warheads) ఉన్నట్లు అంచనా వేసింది.
అమెరికాకు చెందిన 'ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్' (Federation of American Scientists) సంస్థ ఓపెన్ సోర్సెస్, వాణిజ్య ఉపగ్రహ చిత్రాలు, ప్రభుత్వ అధికారిక డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. "భారత్ అణు సామర్థ్యం గల డెలివరీ ఫోర్స్ నిర్మాణం, దాని వ్యూహానికి సంబంధించి అందుబాటులో ఉన్న బహిరంగ సమాచారం ఆధారంగా.. భారత్ సుమారు 190 అణు వార్‌హెడ్‌లను ఉత్పత్తి చేసి ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము" అని ఎఫ్ఏఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సెన్ (Hans Kristensen) తెలిపారు. వీటిలో 160కి పైగా అణ్వాయుధాలు తక్షణమే ప్రయోగించగల లాంచర్ల కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మిగిలిన 30 కొత్తగా తయారవుతున్న క్షిపణుల కోసం ఉత్పత్తి దశలో ఉన్నట్లు వెల్లడించారు. కాగా, గతేడాది భారత్ వద్ద 180 అణ్వాయుధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి ఆ సంఖ్య 190కి చేరింది.
గాలి, నేల, సముద్రం (Nuclear Triad).. మూడు మార్గాల ద్వారా అణు ఆయుధాలను ప్రయోగించే వ్యవస్థలను భారత్ వేగంగా అభివృద్ధి చేస్తోందని హన్స్ క్రిస్టెన్సెన్ చెప్పారు. 2026 ప్రారంభం నాటికి భారత్ వద్ద సుమారు 730 కిలోల వెపన్-గ్రేడ్ ప్లుటోనియం ఉన్నట్లు అంచనా వేశారు. ఒక్కో వార్‌హెడ్‌కు 4 కిలోల ప్లుటోనియం అవసరమైతే, ఈ నిల్వలతో 140 నుండి 225 వార్‌హెడ్లను తయారు చేయవచ్చని వివరించారు. అయితే తన వద్ద ఉన్న ప్లుటోనియం మొత్తాన్ని భారత్ కేవలం ఆయుధాలకే వాడకుండా, భవిష్యత్ అవసరాల కోసం, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం కొంత భాగాన్ని రిజర్వ్‌గా ఉంచుకునే అవకాశం ఉందని హాన్స్ క్రిస్టెన్సెన్ అభిప్రాయపడ్డారు.
పలు నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం తొమ్మిది దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. వాటి వద్ద మొత్తంగా 12వేలకు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. ఇందులో రష్యా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. మాస్కో వద్ద ఇంచుమించు 5,500 అణు వార్‌హెడ్లు ఉన్నాయి. ఆ తర్వాత అగ్రరాజ్యం అమెరికా 5,042 అణు వార్‌హెడ్స్‌తో రెండో ప్లేస్‌లో ఉంది. చైనా వద్ద (500-600), ఫ్రాన్స్ (290), యూకే (225), పాకిస్థాన్ (170), ఇజ్రాయెల్ (90), ఉత్తరకొరియా వద్ద 60 అణ్వాయుధాలు ఉన్నాయి. కాగా, 1998లో పోఖ్రాన్-II పరీక్షల తర్వాత భారత్ 'నో ఫస్ట్ యూజ్' సిద్ధాంతాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. భారత్ ఏ దేశంపైనా మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించదు. కేవలం అవతలి దేశం మనపై అణుదాడికి పాల్పడితేనే మాత్రం వీటిని ఉపయోగిస్తుంది.
Also Read..
భారత్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది : ప్రధాని మోదీ
కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు కంటిన్యూ.. దళపతి విజయ్ స్ట్రాటజిస్ట్ ఎంట్రీపై క్లారిటీ
వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. పాత ఐఫోన్ మోడల్స్ ధరలు భారీగా పెంపు..
తాజావార్తలు
- ●Dasoju Sravan | రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలి..
- ●Sunil Kanugolu | కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు కంటిన్యూ.. దళపతి విజయ్ స్ట్రాటజిస్ట్ ఎంట్రీపై క్లారిటీ
- ●Apple | వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. పాత ఐఫోన్ మోడల్స్ ధరలు భారీగా పెంపు..
- ●Realtor Ram Reddy | ఫామ్ హౌజ్‌లో ఉరేసుకున్న ప్రముఖ రియల్టర్ రామ్ రెడ్డి
- ●Anaswara Rajan | టాలీవుడ్లో అనస్వర రాజన్ జోరు.. మూడు సినిమాలను లైన్లో పెట్టిన మలయాళ బ్యూటీ
- ●Anil Kurmachalam | కాంగ్రెస్ అరాచక పాలనపై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి లేఖ

Dasoju Sravan | రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలి..

Sunil Kanugolu | కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు కంటిన్యూ.. దళపతి విజయ్ స్ట్రాటజిస్ట్ ఎంట్రీపై క్లారిటీ

Apple | వినియోగదారులకు షాకిచ్చిన యాపిల్.. పాత ఐఫోన్ మోడల్స్ ధరలు భారీగా పెంపు..

Realtor Ram Reddy | ఫామ్ హౌజ్‌లో ఉరేసుకున్న ప్రముఖ రియల్టర్ రామ్ రెడ్డి






