World Map | మారనున్న ప్రపంచ పటం!
World Map | ప్రపంచ పటంలో భౌగోళిక ప్రాంతాల పరిమాణాలను మరింత వాస్తవికంగా చూపించేందుకు ఐక్యరాజ్యసమితి చేపట్టిన ప్రయత్నానికి భారత్ మద్దతు తెలిపింది. శతాబ్దాలుగా వినియోగంలో ఉన్న ‘మెర్కేటర్ ప్రొజెక్షన్’కు స్వస్తి పలకాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. అయితే ఈ అంశంపై ఐరాసలో జరిగిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది.
- మార్పులకు మద్దతు తెలిపిన భారత్
- మెర్కేటర్ ప్రొజెక్షన్‌కు ఫ్రాన్స్ గుడ్‌బై
- వ్యతిరేకించిన అమెరికా
World Map | ప్రపంచ పటంలో భౌగోళిక ప్రాంతాల పరిమాణాలను మరింత వాస్తవికంగా చూపించేందుకు ఐక్యరాజ్యసమితి చేపట్టిన ప్రయత్నానికి భారత్ మద్దతు తెలిపింది. శతాబ్దాలుగా వినియోగంలో ఉన్న ‘మెర్కేటర్ ప్రొజెక్షన్’కు స్వస్తి పలకాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. అయితే ఈ అంశంపై ఐరాసలో జరిగిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న మరింత కీలక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో పటాలపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని వాషింగ్టన్ అభిప్రాయపడింది.
164 దేశాల మద్దతు
టోగో ప్రతిపాదించిన ‘కరెక్ట్ ది మ్యాప్: రీబ్యాలెన్సింగ్ గ్లోబల్ కార్టోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ అండ్ ప్రమోటింగ్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది వరల్డ్స్ రీజన్స్, పార్టిక్యులర్లీ ఆఫ్రికా’ తీర్మానాన్ని ఐరాస సర్వప్రతినిధి సభ భారీ మెజారిటీతో ఆమోదించింది. మొత్తం 193 దేశాల్లో 164 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. ఆరు దేశాలు గైర్హాజరయ్యాయి. అమెరికా మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేసింది. 1569లో ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెర్కేటర్ రూపొందించిన పట ప్రొజెక్షన్‌ను ప్రధానంగా సముద్ర ప్రయాణాల్లో నావిగేషన్ కోసం ఉపయోగించేవారు. నావికులకు దిశలు, ఆకృతులను సులభంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడింది. అయితే, భూమధ్యరేఖకు దూరంగా వెళ్లే కొద్దీ ఖండాల వాస్తవ పరిమాణాల్లో భారీ వ్యత్యాసాన్ని చూపిస్తుంది. దీంతో ఉత్తర, దక్షిణ ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు వాస్తవ పరిమాణం కంటే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. మరోవైపు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా వంటి ప్రాంతాలు వాస్తవ పరిమాణం కంటే చిన్నవిగా కనిపిస్తాయి.
‘ఈక్వల్ ఎర్త్’తో వాస్తవ పరిమాణాలు
2018లో కార్టోగ్రాఫర్ల బృందం రూపొందించిన ‘ఈక్వల్ ఎర్త్’ ప్రొజెక్షన్ ఖండాల ఉపరితల వైశాల్యాన్ని సాపేక్షంగా మరింత ఖచ్చితంగా చూపిస్తుంది. దీంతో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియా ప్రాంతాలు వాస్తవ పరిమాణాలకు దగ్గరగా కనిపిస్తాయి. ఈక్వల్ ఎర్త్ రూపకల్పనలో భాగమైన కార్టోగ్రాఫర్ బోజన్ షావ్రిచ్ ప్రకారం.. ఈ ప్రొజెక్షన్ ఖండాల సాపేక్ష వైశాల్యాన్ని కాపాడుతూ వాటి గుర్తించదగిన ఆకృతులను సాధ్యమైనంతవరకు నిలబెడుతుంది.
తీర్మానానికి భారత్ ఓకే.. కానీ
ఐరాస తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. భౌగోళిక అంశాలను ప్రజలు అర్థం చేసుకునే విధానంపై పటాలు ప్రభావం చూపుతాయని ఐరాసలో భారత శాశ్వత మిషన్ ప్రతినిధి రఘూ పురి పేర్కొన్నారు. అయితే, ఈ సందర్భంగా భారత్ కీలకమైన స్పష్టత ఇచ్చింది. తీర్మానానికి మద్దతు ఇవ్వడమంటే ‘ఈక్వల్ ఎర్త్’ ప్రొజెక్షన్‌ను మాత్రమే అధికారికంగా ఆమోదించడం కాదని తెలిపింది. వాస్తవానికి ఖండాల సాపేక్ష వైశాల్యాన్ని మరింత ఖచ్చితంగా చూపించే ‘ఈక్వల్ ఏరియా’ పటాల వినియోగాన్ని విస్తృతంగా పరిశీలించాలన్న సూత్రానికే భారత్ మద్దతు తెలిపింది.
మెర్కేటర్‌కు ఫ్రాన్స్ వీడ్కోలు
ఫ్రాన్స్ మాత్రం మరో అడుగు ముందుకేసింది. వాస్తవ భూవైశాల్యాలను ప్రతిబింబించే పటాలను ఉపయోగించేందుకు మెర్కేటర్ ప్రొజెక్షన్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించింది. మెర్కేటర్ పటంలో రష్యా, అమెరికా, గ్రీన్‌లాండ్ వంటి ఉత్తర ప్రాంతాలు వాటి వాస్తవ పరిమాణం కంటే భారీగా కనిపిస్తాయని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారో అన్నారు. అదే సమయంలో ఆఫ్రికా వంటి ప్రాంతాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ‘‘గ్రీన్‌లాండ్ దాదాపు ఆఫ్రికా అంత పెద్దదిగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్ కంటే దాదాపు 14 రెట్లు పెద్దది’’ అని బారో వ్యాఖ్యానించారు. టోగో, ఆఫ్రికన్ యూనియన్ ప్రతిపాదించిన ఐరాస తీర్మానానికి ఫ్రాన్స్ కో స్పాన్సరింగ్ దేశంగా ఉంది. అవసరానికి అనుగుణంగా, భూవైశాల్యాలను మరింత వాస్తవికంగా చూపించే పటాలను ఉపయోగించాలని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ నిర్ణయించింది.
ఆఫ్రికాతో సంబంధాల కోణంలోనూ..
పటాల మార్పు భౌగోళిక వాస్తవాలను మార్చదని ఫ్రాన్స్ అంగీకరించింది. వక్రీకరించిన దృశ్యరూపాన్ని సరిదిద్దడం విస్తృతమైన ప్రాధాన్యం కలిగిన అంశమని పేర్కొంది. ఆఫ్రికా దేశాలతో సంబంధాలను పునరుద్ధరించేందుకు పారిస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం కూడా ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఫ్రెంచ్ కాలనీల్లో ఫ్రాన్స్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. కొన్ని దేశాలు ఫ్రెంచ్ సైన్యాన్ని వెళ్లగొట్టి రష్యాకు దగ్గరవుతున్నాయి. అయితే, ఐరాస తీర్మానాన్ని అమెరికా మాత్రం వ్యతిరేకించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యల కంటే 16వ శతాబ్దానికి చెందిన పటాలపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితం కాదని పేర్కొంది. ఓటింగ్‌కు ముందు అమెరికా ప్రతినిధి యరీనా ఫెరెన్సెవిచ్ ఈ ప్రతిపాదనపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి చర్చలు ఐరాస విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉందని అన్నారు. 16వ శతాబ్దపు మ్యాప్ ప్రొజెక్షన్లు, వాటి సామాజిక ప్రభావాలపై చర్చించడంకంటే ప్రపంచంలోని సమస్యలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ఒక్కరోజులో ప్రపంచ పటం మారదు
ఐరాస తీర్మానం ఆమోదించినంత మాత్రాన ప్రపంచమంతా ఒక్క కొత్త పటాన్ని ఉపయోగించడం మొదలుకాదు. వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు భౌగోళిక సమాచారాన్ని ఎలా చూపిస్తున్నాయన్నదానిపై పునరాలోచన చేయాలన్న రాజకీయ సంకేతాన్ని ఈ తీర్మానం ఇచ్చింది. ఈ ప్రయత్నానికి భారత్ మద్దతు ఇవ్వగా.. ఫ్రాన్స్ ఆచరణలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అమెరికా మాత్రం దీన్ని వ్యతిరేకించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | మంచి వక్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్ సమాధానం.. నవ్వేసిన ప్రధాని..!
సెప్టెంబర్ 5, 2026

Heavy Rain In Delhi | జన్మాష్టమి వేళ ఢిల్లీకి భారీ వర్షం.. ఎయిర్‌పోర్ట్‌లోకి నీరు.. తొమ్మిది విమానాలు దారి మళ్లింపు
సెప్టెంబర్ 4, 2026

Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | అవినీతిని న్యాయబద్ధం చేయడానికే 22ఏ జాబితా
- ●Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం
- ●KTR Karimnagar Speech | ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయితదో ఆయనే కేసీఆర్
- ●SIP | రూ.10వేల సిప్‌తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..
- ●PM Modi | మంచి వక్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్ సమాధానం.. నవ్వేసిన ప్రధాని..!
- ●Polytechnic Students Protest | కంటోన్మెంట్లో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధర్నా.. ఫోన్లో మద్దతు తెలిపిన కేటీఆర్

Ramchandar Rao | అవినీతిని న్యాయబద్ధం చేయడానికే 22ఏ జాబితా

Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం

KTR Karimnagar Speech | ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయితదో ఆయనే కేసీఆర్

SIP | రూ.10వేల సిప్‌తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..



