త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలి..

Dasoju Sravan | తెలంగాణ‌లో అనుముల రాజ్యాంగం ఉందా..? అంబేద్క‌ర్ రాజ్యాంగం ఉందా..? రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ నిల‌దీశారు. అసెంబ్లీ సాక్షిగా ఫేక్ అకౌంట్ల‌ను ప్ర‌స్తావిస్తూ బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిని స‌భ నుంచి డిబార్ చేయాల‌ని దాసోజు డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Sep 10, 2026, 5.16 pm IST

Dasoju Sravan | రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలి..
Advertisement

స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన రేవంత్
ఈ సెష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు స‌భ‌కు రావొద్దు
రేవంత్‌కు తెలంగాణ బ‌హిష్క‌ర‌ణ త‌ప్ప‌దు
అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్సీ దాసోజు

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో అనుముల రాజ్యాంగం ఉందా..? అంబేద్క‌ర్ రాజ్యాంగం ఉందా..? రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ నిల‌దీశారు. అసెంబ్లీ సాక్షిగా ఫేక్ అకౌంట్ల‌ను ప్ర‌స్తావిస్తూ బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిని స‌భ నుంచి డిబార్ చేయాల‌ని దాసోజు డిమాండ్ చేశారు. స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన రేవంత్.. ఈ సెష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కు రావొద్ద‌న్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో దాసోజు శ్ర‌వ‌ణ్ మీడియాతో మాట్లాడారు.

22ఏ పేరుతో జరుగుతున్న విచ్చలవిడి దోపీడీపై చర్చ జరగాలి. జీవో 97 ద్వారా విద్యార్థుల జీవితాలు ఆగం అవుతున్నాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. దానిపై చర్చ జరగాలని డిమాండ్ చేశాం. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజా సమస్యలు చర్చకు వస్తాయనుకుంటే దుర్యోధన దుశ్శాసన సభ నడుపుతున్నారు. సిగ్గుమాలిన రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని దాసోజు శ్ర‌వ‌ణ్ నిప్పులు చెరిగారు.

ఆ భగ‌వంతుడు కూడా కాపాడలేడు

జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని రేవంత్ రెడ్డి దొర ఆడుతున్న నాట‌కం ఇది. కుట్ర‌లు, కుతంత్రాలతో స‌భ‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించారు. రేవంత్ రెడ్డి.. నువ్వు ఎన్ని కుల రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేసిన ఆ భగ‌వంతుడు కూడా కాపాడలేడు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం అన్ని గమనిస్తూ ఉంది. స్పీకర్‌ను ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు అవమానించారు. స్పీకర్ కుర్చీని అవమానించారు. సిగ్గు లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అని మండిప‌డ్డారు.

అడ్డుకున్న పోలీసుల‌పై కేసులు పెట్టాలి

మొదటి రోజు శాసనసభ, మండలి సభ్యులను గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడం ఏంటి..? గేటు బయట అడ్డుకోవడం పోలీసులకు ఎంత గుండె దైర్యం. తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే పోలీసులు దాడులు చేశారో మా సభ్యులపైన కూడా అదే విధంగా దాడి చేస్తున్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవద్దు అని కోర్టు చెప్పింది. అడ్డుకున్న పోలీసులపై కేసులు పెట్టాలని హైకోర్ట్ ఆదేశించింది. ఎమ్మెల్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.. కోర్టు రిమాండ్ తిరస్కరించింది. స‌భ్యులు సభలోకి రాగానే వాళ్లను సస్పెండ్ చేశారు అని దాసోజు తెలిపారు.

కేసీఆర్ మీద హత్యాయత్నం చేశావు

కేసీఆర్ మీద హత్యాయత్నం చేశావు సిగ్గుందా నీకు రేవంత్ రెడ్డి. పోలీసులను పెట్టీ నీ శాసన సభ్యులను కేసీఆర్ ఇంటి మీదకు పంపించావు. వీర్లపల్లి శంకర్ కేసీఆర్ చావు కోరుకుంటుడు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తున్నడు. స్పీకర్ వ్యవస్థను అవమానపరుస్తున్న రేవంత్ రెడ్ప అత్యాచార కేసు పెట్టాలి. కేసీఆర్ చావును కోరుకున్న శంక‌ర్‌పై, చావు డప్పు కొట్టిన ఎమ్మెల్యేలపై ఎందుకు కేసు పెట్టరు. రేవంత్‌ను భవిష్యత్లో తెలంగాణ బహిష్కరణ చేస్తారు. ఆయనకు మంచి నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్ప‌డుతుంద‌ని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement