Anaswara Rajan | టాలీవుడ్‌లో అనస్వర రాజన్ జోరు.. మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన మలయాళ బ్యూటీ
మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ టాలీవుడ్‌లో బిజీ అవుతోంది. ప్రస్తుతం చిరంజీవి కాకాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తోంది. మాతృభాష మలయాళంలో కంటే టాలీవుడ్‌లోనే అనస్వరకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.
Entertainment | Published On Sep 10, 2026, 4.48 pm IST
Anaswara Rajan | మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. దర్శకనిర్మాతలు ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంటూ జోరుమీదుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తోంది అనస్వర రాజన్. చిరంజీవి కాకాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మలయాళ భామ మరో రెండు సినిమాల్లో కథానాయికగా కనిపించబోతుంది.
అమ్ములు పాప...
కాకా మూవీలో అనస్వర రాజన్ అమ్ముడు పాప అనే పాత్రలో కనిపించబోతుంది. అమ్ముడు పాప అనే క్యారెక్టర్ చేస్తోంది. అనస్వర రాజన్ పాత్ర ప్రధానంగానే కాకా మూవీ కథ సాగుతుందని సమాచారం. ఇటీవలే అనస్వర బర్త్‌డే సందర్భంగా కాకా మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ట్రెడిషనల్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న కాకా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇట్లు అర్జున...
హీరోయిన్‌గా ప్రస్తుతం తెలుగులో ఇట్లు అర్జునతో పాటు అంతా రాములోరు చూస్కుంటారు సినిమాలు చేస్తోంది. ఇట్లు అర్జున సినిమా అక్టోబర్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను ఛలో, భీష్మ సినిమాల డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.
అంతా రాములోరు చూస్కుంటారు...
అనస్వర రాజన్ మరో తెలుగు మూవీ అంతా రాములోరు చూస్కుంటారు ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శిరీష అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనస్వర కనిపించబోతుంది.
బైలింగ్వల్...
ఈ మూడు సినిమాలే కాకుండా 7జీ బృందావన కాలనీ సీక్వెల్‌లో ఈ మలయాళ ముద్దుగుమ్మ నటిస్తోంది. బైలింగ్వల్ మూవీగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
వీటితో పాటు అనస్వర రాజన్ హీరోయిన్‌గా మరో రెండు కొత్త సినిమాలు కూడా డిస్కషన్స్ స్టేజ్‌లో ఉన్నట్లు సమాచారం. మాతృభాషలో మాత్రం ప్రస్తుతం ఒక్క సినిమా చేయడం లేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Samantha | సినిమాలు మానేయాలనుకున్నా – విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
సెప్టెంబర్ 10, 2026

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి – మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
సెప్టెంబర్ 10, 2026

Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Anil Kurmachalam | కాంగ్రెస్ అరాచక పాలనపై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి లేఖ
- ●CM Revanth Reddy Fake Tweet | సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
- ●Bhatti Vikramarka | 19 వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్.. ఫ్లోటింగ్ సోలార్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- ●PM Modi | భారత్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది : ప్రధాని మోదీ
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Anil Kurmachalam | కాంగ్రెస్ అరాచక పాలనపై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి లేఖ

CM Revanth Reddy Fake Tweet | సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Bhatti Vikramarka | 19 వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్.. ఫ్లోటింగ్ సోలార్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

PM Modi | భారత్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది : ప్రధాని మోదీ



