త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | కొత్త శిఖరాలకు భార‌త్‌-ఫ్రాన్స్ సంబంధాలు : ప్ర‌ధాని మోదీ

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : భారత్-ఫ్రాన్స్ సంబంధాలు (India-France relations) కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. పారిస్‌లోని స్వామినారాయ‌ణ ఆల‌య (Swaminarayan temple in Paris) ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్‌గా పాల్గొని ప్ర‌సంగించారు.

D

National | Published On Sep 7, 2026, 1.35 pm IST

PM Modi | కొత్త శిఖరాలకు భార‌త్‌-ఫ్రాన్స్ సంబంధాలు : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | భారత్-ఫ్రాన్స్ సంబంధాలు (India-France relations) కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధం కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యానికే పరిమితం కాదని, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంస్కృతిక, రాజకీయ సంబంధాలే దానికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. పారిస్‌లోని స్వామినారాయ‌ణ ఆల‌య (Swaminarayan temple in Paris) ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్‌గా పాల్గొని ప్ర‌సంగించారు.

ఇటీవలి సంవత్సరాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని చెప్పారు. "నా మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయి. సాంకేతిక‌త‌, ఏఐ, ర‌క్ష‌ణ రంగాల నుంచి అంత‌రిక్షం, వాతావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వ‌ర‌కు ఇరు దేశాలు నూత‌న ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. మేము 2026ను భారత్-ఫ్రాన్స్ నూతన ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాము. ఈ వ్యూహాత్మ భాగ‌స్వామ్యం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఎందుకంటే ఇది మ‌న సుదీర్ఘ సాంస్కృతిక‌, రాజ‌కీయ సంబంధాల పటిష్టమైన పునాదిపై ఆధారపడి ఉంది. ప్ర‌స్తుతం రెండు దేశాల జాయింట్ వెంచ‌ర్ అవ‌కాశాలపై విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. వివిధ సంద‌ర్భాల్లో ఫ్రాన్స్‌లో భార‌త సైనికుల త్యాగాలు నేటికీ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నాయ‌ని చ‌రిత్ర చెబుతోంది" అని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు.

ఫ్రాన్స్‌తో భారత్ సాంస్కృతిక బంధం మరింత దృఢం

భారత్​, ఫ్రాన్స్ మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని ప్ర‌ధాని ప్ర‌ముఖంగా ప్రస్తావించారు. సంస్కృత భాష ప్రాచుర్యంలో ఫ్రాన్స్ విద్వాంసులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమెయిన్ రోలాండ్ రాసిన రచనలు మన సమాజాలను మరింత దగ్గర చేశాయని పేర్కొన్నారు. పారిస్ నుంచి పుదుచ్చేరిలోని శ్రీ అరవిందో ఆశ్రమానికి ‘ది మదర్’ సాగించిన ఆధ్యాత్మిక యాత్ర ఇరు దేశాల‌కు చెందిన ఆధ్యాత్మిక సాధకులను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. అలాగే దశాబ్దాల క్రితం శ్రీల ప్రభుపాద స్వామి కూడా ఫ్రాన్స్‌ను సందర్శించి ఇస్కాన్ (ISKCON) ద్వారా ఇరు దేశాల ఆధ్యాత్మిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీశారని గుర్తుచేశారు.

ప్రజల మధ్య వారధిగా యోగ

ప్ర‌స్తుతం యోగా కూడా ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య అనుబంధానికి వారధిగా మారిందని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈఫిల్ ట‌వ‌ర్ వ‌ద్ద కనిపించే దృశ్యాలే ఫ్రాన్స్‌లో యోగాకు ఉన్న విశేష ప్ర‌జాద‌ర‌ణ‌కు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.

‘మేడ్ ఇన్ ఇండియా - బిల్ట్ ఇన్ ఫ్రాన్స్’

పారిస్‌లో నిర్మించిన సరికొత్త స్వామినారాయణ ఆలయం కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచిందని ప్ర‌ధాని చెప్పారు. ఇది అచ్చంగా 'మేడ్ ఇన్ ఇండియా-బిల్ట్ ఇన్ ఫ్రాన్స్' శైలిలో రూపుదిద్దుకుందని తెలిపారు. "ఈ ఆలయానికి సంబంధించిన అనేక శిల్సాల‌నును భారత్‌లోనే చెక్కారు. ఇది భారత్ ప్రాచీన శిల్పకళను, ఫ్రాన్స్ ఆధునిక ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని అద్భుతంగా మేళవిస్తుంది" అని ఆయన ప్ర‌ధాని కొనియాడారు.

త‌ప్ప‌కుండా ఆల‌యాన్ని సంద‌ర్శిస్తా..

పారిస్‌లో నూతనంగా నిర్మించిన ఈ ఆలయం నుంచి వెలువడే భారతీయ సంస్కృతి విలువలు యూరప్ అంతటా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తనకు సమయం కుదిరినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తాన‌ని ప్ర‌ధాని వెల్ల‌డించారు. స్వామినారాయణ ఆలయాలు సాధారణంగా భక్తితో పాటు సేవా కార్యక్రమాలకు కూడా కేంద్రాలుగా నిలుస్తాయ‌ని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు. పారిస్‌లోని ఈ నూత‌న ఆలయం కూడా భవిష్యత్తులో పలు సేవా కార్యక్రమాలకు వేదికగా మారుతుంద‌ని వెల్ల‌డించారు.

Also Read..

ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ఐపీవో.. లిస్టింగ్‌కు ముందే భారీ లాభం..

రాష్ట్రంలో కొన‌సాగుతున్న దుశ్శాస‌న ప‌ర్వం.. మ‌హిళ‌ల‌ను అవ‌మానించ‌డ‌మే ఇందిర‌మ్మ రాజ్య‌మా?: సునీతా ల‌క్ష్మారెడ్డి

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను త‌గ‌వు : మంత్రి వాకిటి శ్రీహరి

Advertisement
Advertisement