Anil Kurmachalam | కాంగ్రెస్ అరాచక పాలనపై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి లేఖ
Anil Kurmachalam | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్ష హక్కులు దెబ్బతింటున్నాయని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఆందోళన వ్యక్తం చేశారు.
Anil Kurmachalam | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్ష హక్కులు దెబ్బతింటున్నాయని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు, పరిపాలనా యంత్రాంగాన్ని ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగిస్తోందని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అమానుషంగా దాడులు చేయడంతో పాటు, అరెస్టులు, నిర్బంధాలు వంటి ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్రపతిని కోరారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం పాటించడంతో పాటు, చట్టబద్ధమైన విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మహిళా నేతలు, మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దౌర్జన్యాలు, దురుసు ప్రవర్తనపై కూడా నిష్పాక్షిక విచారణ జరపాలని అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు. మహిళా ప్రజాప్రతినిధులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజాస్వామ్య కార్యక్రమాల్లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సస్పెన్షన్ల వెనుక ఉన్న పరిస్థితులను కూడా పరిశీలించాలని రాష్ట్రపతిని కోరారు. శాసనసభ, శాసనమండలి నిబంధనలు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సస్పెన్షన్లు జరిగాయా అనే అంశంపై సమీక్ష అవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం బలపడదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉందని అనిల్ కూర్మాచలం స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై అధికార యంత్రాంగాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజకీయ విభేదాలను చర్చలు, ఎన్నికలు, శాసన ప్రక్రియలు, న్యాయపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
కేసీఆర్ ప్రాణాలకు ముప్పు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భద్రతపై కూడా లేఖలో ప్రత్యేక ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రాణ భద్రతకు ముప్పు ఉందన్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వంటి ప్రముఖ ప్రజా నాయకుడి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని పేర్కొన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌పై దాడికి ప్రయత్నించి, వచ్చిన బెదిరింపుల తీవ్రత, విశ్వసనీయతపై తక్షణమే సమగ్ర అంచనా వేయాలని అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు. బెదిరింపుల మూలాలను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రొఫెషనల్ థ్రెట్ అసెస్మెంట్ ఆధారంగా కేసీఆర్ గారికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్రపతిని కోరారు.
తెలంగాణలో రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధత, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అనిల్ కూర్మాచలం గుర్తుచేశారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ బాధ్యతలను నిర్వహించే పరిస్థితులను కల్పించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు చర్యలు, దాడులు, రాజకీయ వేధింపులపై స్వతంత్రంగా పరిశీలన జరపాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని, రాజ్యాంగ సంస్థలు రాజకీయ వివక్షకు అతీతంగా స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అనిల్ కూర్మాచలం రాష్ట్రపతిని కోరారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం, న్యాయపాలన, రాజకీయ స్వేచ్ఛ, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రపతి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా భద్రత, న్యాయం కోసం రాష్ట్రపతి తక్షణ జోక్యం చేసుకుంటారన్న పూర్తి విశ్వాసం ఉందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ & ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తన లేఖలో తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | 19 వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్.. ఫ్లోటింగ్ సోలార్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- ●PM Modi | భారత్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది : ప్రధాని మోదీ
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు

Bhatti Vikramarka | 19 వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్.. ఫ్లోటింగ్ సోలార్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

PM Modi | భారత్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది : ప్రధాని మోదీ

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు




