Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం
Woman fight with Jackal | ఓ వృద్ధురాలు పశువుల మేత కోసం అడవిలోకి వెళ్లింది. మేత కోస్తుండగా.. చెట్ల పొదల మాటున దాగి ఉన్న ఓ నక్క( Jackal ) ఆమెపై దాడి చేసింది. సుమారు అర గంట పాటు నక్కతో ఆ వృద్దురాలు వీరోచిత పోరాటం చేసి, చివరకు తన ప్రాణాలను కాపాడుకుంది.
Woman fight with Jackal | త్రినేత్ర.న్యూస్ : ఓ వృద్ధురాలు పశువుల మేత కోసం అడవిలోకి వెళ్లింది. మేత కోస్తుండగా.. చెట్ల పొదల మాటున దాగి ఉన్న ఓ నక్క( Jackal ) ఆమెపై దాడి చేసింది. సుమారు అర గంట పాటు నక్కతో ఆ వృద్దురాలు వీరోచిత పోరాటం చేసి, చివరకు తన ప్రాణాలను కాపాడుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానా నుహు జిల్లాలోని సుఖ్‌పురి గ్రామానికి చెందిన బాషిరి(60)కి పశువులు ఉన్నాయి. ఇక వాటికి మేత కోసం ఆమె నిత్యం గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్తుంటుంది. అయితే శనివారం ఉదయం కూడా పశువులకు మేత కోసమని అడవిలోకి వెళ్లింది. మేత కోస్తుండగా.. సమీపంలో చెట్ల పొదల మాటున దాగి ఉన్న నక్క.. ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది.
తీవ్ర భయాందోళనకు గురైన బాషిరి నక్క బెదిరింపులకు ఏ మాత్రం వణకలేదు.. బెదరలేదు. ఆమెపై దాడి చేసేందుకు యత్నించిన నక్కను ఒంటి చేత్తో నిలువరించింది. దాని దవడలను రెండు చేతులతో గట్టిగా అదిమిపట్టింది ముసలావిడ. ఇక కాపాడంటూ గట్టిగా కేకలు వేసింది. సమీప పొలాల్లో ఉన్న రైతులు ఆమె అరుపులు విని అప్రమత్తమయ్యారు. అక్కడికి చేరుకుని నక్కను తరిమేశారు.
తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండు చేతులు దెబ్బతిన్నాయి. చేతులకు చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం బాషిరి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అడవి జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Gym Owner Shot Dead | 5 సెకన్లలో 10 రౌండ్లు.. జిమ్ ఓనర్పై బుల్లెట్ల వర్షం.. షాకింగ్ వీడియో
జూన్ 11, 2026

BJP New State Presidents | బీజేపీలో భారీ ప్రక్షాళన: ఢిల్లీ, పంజాబ్ సహా నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు.. పూర్తి లిస్ట్ ఇదే
మే 28, 2026

Dera Baba | డేరా బాబాకు మరోసారి పెరోల్.. తొమ్మిదేళ్లలో 16వసారి
మే 26, 2026
తాజావార్తలు
- ●Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..
- ●Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల
- ●Strong surface winds | జూలై 11 వరకు బలమైన గాలులు.. బీ కేర్ఫుల్..!
- ●Black-crowned night heron | బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
- ●Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!
- ●POCSO Accused Escapes | మహబూబ్నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..

Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల

Strong surface winds | జూలై 11 వరకు బలమైన గాలులు.. బీ కేర్ఫుల్..!

Black-crowned night heron | బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!



