త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balapur Ganesh | పూరీ జ‌గ‌న్నాథ‌స్వామి ఆలయ నమూనాలో బాలాపూర్‌ గ‌ణేశుడి మండపం

Balapur Ganesh | రాష్ట్రంలో వినాయ‌క (Vinayaka Chavithi) ఉత్స‌వాలు అన‌గానే మొద‌ట గుర్తుకువ‌చ్చేది ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు . ఆ త‌ర్వాత బాలాపూర్ గ‌ణేశుడు (Balapur Ganesh). ల‌డ్డూ వేలం పాట‌తో (Laddu Velam) గ‌ణ‌తికెక్కిన బాలాపూర్ గ‌ణ‌ప‌య్య ఉత్స‌వాల‌ను ఏటా ఘ‌నంగా నిర్వ‌హిస్తూ ఉంటారు.

G

Hyderabad | Published On Aug 16, 2026, 6.07 am IST

Balapur Ganesh | పూరీ జ‌గ‌న్నాథ‌స్వామి ఆలయ నమూనాలో బాలాపూర్‌ గ‌ణేశుడి మండపం
Advertisement

Balapur Ganesh | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో వినాయ‌క (Vinayaka Chavithi) ఉత్స‌వాలు అన‌గానే మొద‌ట గుర్తుకువ‌చ్చేది ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు . ఆ త‌ర్వాత బాలాపూర్ గ‌ణేశుడు (Balapur Ganesh). ల‌డ్డూ వేలం పాట‌తో (Laddu Velam) గ‌ణ‌తికెక్కిన బాలాపూర్ గ‌ణ‌ప‌య్య ఉత్స‌వాల‌ను ఏటా ఘ‌నంగా నిర్వ‌హిస్తూ ఉంటారు. వినాయ‌కుని ప్ర‌తిమ‌తోపాటు మండ‌పం (Ganesh Mandap), అలంక‌ర‌ణ ప్ర‌త్యేకంగా ఉండేలా నిర్వాహ‌కులు చూసుకుంటూ ఉంటారు. మ‌రో నెల రోజుల్లో లంబోధ‌రుని ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో బాలాపూర్ వినాయ‌కుడు ఈ ఏడాది పూరీ జ‌గ‌న్నాథ‌స్వామి ఆల‌య (Puri Jagannath Temple) న‌మూనాలో ఏర్పాటు చేయ‌నున్న మండ‌పంలో కొలువుదీర‌నున్నాడు.

ఏటా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలో మండపాన్ని నిర్వాహకులు తీర్చిదిద్దుతుంటారు. ఇప్పటివరకు శ్రీశైలం, యాదగిరిగుట్ట, విజయవాడ కనకదుర్గ, అయోధ్య, అరుణాచలం, యాదాద్రి స్వర్ణగిరి ఆలయం నమూనాలో మండపాలను ఏర్పాటు చేశారు. ఈసారి ఒడిశాలోని పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనాలో మండపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహ‌కులు తెలిపారు.

ఏటా స‌రికొత్త రికార్డే..

1980లో బాలాపూర్ గణేశ్‌ ఉత్సవ సమితి పురుడుపోసుకుంది. 1994లో రూ.450తో ప్రారంభమైన బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం.. వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది. ఎప్పటికప్పుడు తన రికార్డును తానే రీక్రియేట్‌ చేసుకుంటోంది. ప్రతి ఏడాది స్థానికులు, స్థానికేతరుల మధ్య వేలం పాట నువ్వా నేనా అన్నట్లు జరుగుతుంది. లడ్డూను దక్కించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. 2024 వేలంలో రూ.30.01 లక్షల ధర పలికింది. 2025లో రికార్డు స్థాయిలో రూ.35 ల‌క్ష‌ల‌క ధ‌ర ప‌లికింది.

వినాయక చవితి పండుగ ప్రారంభం రోజు నుంచి లడ్డూ వేలం (Laddu Auction) పాటలో పాల్గొనాలి అనుకునే నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. వినాయకుడి నిమజ్జనం రోజు ఉదయం 7.00 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం లడ్డు వేలం పాట రూ.1116లతో ప్రారంభం అవుతుంది. ఈ వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న వాళ్లు డ‌బ్బును వెంట‌నే చెల్సించాల్సి ఉంటుంది. ఈ లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన సొమ్మును బాలాపూర్ గణేష్‌ ఉత్సవ కమిటీ గ్రామ అభివృద్ధికి, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది.

వినాయక చవితి ఉత్సవాల ముగింపు రోజైన అనంత చతుర్దశి నాడు బాలాపూర్ గణేశుడి నిమజ్జన శోభాయాత్ర (Ganesh Shobha Yatra) అత్యంత కోలాహలంగా ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపు పాతబస్తీలోని చార్మినార్ మీదుగా సాగుతూ హుస్సేన్ సాగర్ (Tank Bund) వైపు తరలుతుంది. ఈ శోభాయాత్రను తిలకించడానికి వేలాది మంది భక్తులు రోడ్లపైకి వస్తారు.

 

Advertisement
Advertisement