Woman Pilot | మహిళా పైలట్‌కు వేధింపులు.. జిమ్ మేనేజర్‌పై కేసు..
Female Pilot | హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో (Sanathnagar) ఓ మహిళా పైలట్‌కు (Female Pilot) వేధింపుల ఘటన కలకలం సృష్టించింది. ఓ జిమ్ మేనేజర్ (Gym Manager) ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనికి ఓ మహిళ కూడా సహకరించడం గమనార్హం.
Woman Pilot | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో (Sanathnagar) ఓ మహిళా పైలట్‌కు (Woman Pilot) వేధింపుల ఘటన కలకలం సృష్టించింది. ఓ జిమ్ మేనేజర్ (Gym Manager) ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనికి ఓ మహిళ కూడా సహకరించడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కల్ట్ జిమ్ ఫిట్‌నెస్ (Cult.fit) మేనేజర్ సంతోశ్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు.
జిమ్ ట్రైనింగ్ పేరుతో తనను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడని పైలట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక రాత్రి తనతో గడపాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చాడని, దానికి ఒప్పుకోకపోవడంతో సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) తనపై అసభ్య మెసేజ్‌లు పంపుతూ తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని తెలిపారు. దీనికి అతని స్నేహితురాలైన రజిత కూడా సహకరించారని వెల్లడించారు. ఒకేసారి ఇద్దరితో కలిసి ప్రైవేట్‌గా ఉండటమే సంతోశ్ ఫాంటసీ అంటూ ఆమె తనను ఒప్పించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. రోజురోజుకు వేధింపులు ఎక్కువవుతుండటంతో సనత్‌నగర్ పోలీసులను బాధితురాలు ఆశ్రయించారు. దీంతో కేసు నమోదుచేసి, నిందితుడు సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్






