Gold And Silver Prices Today | బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఇదే సరైన సమయమా..?
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ దేశాలు శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బుల్ ర్యాలీలతో కొనసాగుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లకు సైతం ఊతం లభించింది. ఇక ఈ ప్రభావం బంగారంపైనా పడింది.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ దేశాలు శాంతి చర్చల దిశగా అడుగులు వేస్తుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బుల్ ర్యాలీలతో కొనసాగుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లకు సైతం ఊతం లభించింది. ఇక ఈ ప్రభావం బంగారంపైనా పడింది. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటుండగా, తాజా పరిణామాలతో ఆయా లోహాల ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.15 శాతం పెరిగి 4,218 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.97 శాతం పెరిగి 68 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1596 పాయింట్లు పెరిగి 1,50,528 వద్ద ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 6533 పాయింట్లు పెరిగి 2,46,186 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,908 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19, 264 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,080 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,90,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.5వేలు పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,665 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,320గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,36,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,66,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,181 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,448గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,11,810 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,18,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,700 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,70,000 ఉండగా, తులం ధర రూ.2,700 గా ఉంది.
సంబంధిత వార్తలు

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు
అక్టోబర్ 2, 2026

Gold And Silver Prices Today | పసిడికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్..
అక్టోబర్ 2, 2026

Gold Prices | సెప్టెంబర్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. దీపావళి సీజన్ కలిసొచ్చేనా..?
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం
- ●ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్
- ●Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్
- ●V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్
- ●Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీకరణను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
- ●AISF | ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష, కార్యదర్శిగా మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్

TUWJ | హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టుల పోస్టు కార్డు ఉద్యమం

ల్యాప్‌టాప్ షట్‌డౌన్… మైండ్ ఇంకా ఆన్లైన్! ఐటీ ఉద్యోగులను వేధించే బర్నౌట్

Tamil Nadu | తమిళనాడులో హైవే బోర్డులపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెండ్

V Prakash | ప్రత్యేక దేశం కోసం పోరాడాల్సి వస్తుంది : వీ ప్రకాశ్



