Army chief | సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత తాత్కాలికమే.. ఆపరేషన్ సిందూర్ 2.0కు త్రివిధ దళాలు సిద్ధం : ఆర్మీ చీఫ్
Army chief | 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని భారత సైన్యాధిపతి (Army chief) జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత కేవలం తాత్కాలికమేనని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ 2.0కు (Operation Sindoor 2.0) త్రివిధ దళాలు (Tri-Services) పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
Army chief | భారత సైన్యాధిపతి (Army chief) జనరల్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత కేవలం తాత్కాలికమేనని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ 2.0కు (Operation Sindoor 2.0) సంబంధించి త్రివిధ దళాలు (Tri-Services) పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. శత్రు దేశాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు.
మహారాష్ట్రలోని ఖడక్‌వాస్లాలోని (Khadakwasla) ఎన్‌డీఏలో జరిగిన 150వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. "ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. తాత్కాలికంగా ఘర్షణలు ఆగిపోయాయి. ఒకవేళ ఆపరేషన్ సిందూర్ 2.0 జరిగితే దానికోసం దేశ త్రివిధ దళాలు పూర్తిగా సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుతం, మేము త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంచుకోవడం, తదుపరి యుద్ధానికి సన్నద్ధం కావడంపై దృష్టి సారిస్తున్నాం" అని చెప్పారు. జాతీయ సంకల్పాన్ని కచ్చితత్వంతో, దృఢ నిశ్చయంతో ఎలా వ్యక్తపరచవచ్చో 'ఆపరేషన్ సిందూర్' ఒక ప్రమాణాన్ని నెలకొల్పిందని ఆర్మీ చీఫ్ తెలిపారు. రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఇచ్చే ప్రతిస్పందనను ఆపరేషన్ సిందూర్ నిర్వచించిందని అన్నారు.
ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు జనరల్ ద్వివేది ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో యుద్ధరంగంలోని ప్రతి కదలిక స్పష్టంగా కనిపించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అందుకే కేవలం సైనికుల భద్రత మాత్రమే కాకుండా పౌరుల రక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 24 గంటలూ రక్షణ దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయని వివరించారు. యుద్ధంలో విజయం సాధించాలంటే దేశ ప్రజల మద్దతు ఎంతో అవసరమని జనరల్ ద్వివేది పేర్కొన్నారు. ప్రజలు అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. దేశమంతా ఒకే తాటిపైకి వచ్చినప్పుడే శత్రువుపై విజయం సాధ్యమవుతుందని వివరించారు.
Also Read..
ఉద్రిక్తతల మధ్యే హర్మూజ్‌ను దాటుతున్న భారత నౌకలు.. సీక్రెట్‌ను రివీల్ చేసిన కేంద్రం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
ఆగస్టు 25, 2026

Gen Dhiraj Seth | ‘విజయ్’ నినాదంతో.. నూతన ఆర్మీ చీఫ్‌గా ఛార్జ్ తీసుకున్న జనరల్ ధీరజ్ సేథ్
జులై 1, 2026

Rajnath Singh | సింధూర్‌లో సైనికులెవరూ అమరులు కాలేదంటూ ప్రకటన.. రాజ్‌నాథ్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
జూన్ 30, 2026
తాజావార్తలు
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు
- ●BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు
- ●Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..
- ●BJYM | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం
- ●One Nation One Election 2029 | 2029లోనే 'జమిలి' సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్

Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!

Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు

BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు

Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..



