CBSE Portal | సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి
CBSE Portal | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్ హ్యాక్‌కు గురైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
CBSE Portal | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్ హ్యాక్‌కు గురైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సుమారు 50 మంది విద్యార్థులు అనధికారికంగా యాక్సెస్ పొందినట్లు (50 Children Got Into System) చెప్పారు.
"పోర్టల్‌పై కొన్ని అనధికారిక దాడులు జరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ చెల్లింపులకు సంబంధించిన గేట్‌వేలో (HDFC payment gateway) మాత్రమే ఈ సమస్యలు వచ్చాయి. దాదాపు 50 మంది విద్యార్థులు అనధికారికంగా ఇందులోకి ప్రవేశించారు. పేమెంట్ సిస్టమ్‌ను మానిప్యులేట్ చేసి ఫీజుల ధరలను మార్చేశారు. దీంతో పోర్టల్‌లో ఫీజుల ప్రదర్శనల్లో వ్యత్యాసం కనిపించింది. ఫీజులు ఒక రూపాయి నుంచి 68,000 వేల రూపాయల వరకూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దాదాపు 50 మంది పిల్లల విషయంలో ఈ ఫీజు మొత్తం మారిపోయింది" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) విధానంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి (CBSE OSM controversy). ఈ విధానం కారణంగా తమ జవాబు పత్రాలు తారుమారు అయ్యాయంటూ పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జవాబు పత్రాల స్కానింగ్ కోసం పెద్దఎత్తున విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను 17 లక్షల మంది విద్యార్థులు రాయగా.. వీరిలో ఇప్పటివరకు 4,04,319 మంది స్కానింగ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
దీనిపై స్పందించిన బోర్డు విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్ కాపీలను అందిస్తామని, వాటిని సరిచూసుకొని రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ రీవాల్యూయేషన్ కోసం చెల్లించాల్సిన పేమెంట్ పోర్టల్‌పైనే తాజాగా సైబర్ దాడి జరిగింది. వ్యవస్థతో అనుసంధానించబడిన హెచ్‌డీఎఫ్‌సీ పేమెంట్ గేట్‌వే వల్లనే ఈ సాకేంతిక లోపం తలెత్తినట్లు అధికారులు తెలిపారు. పోర్టల్ లైవ్‌లోకి వచ్చినప్పుడు సైబర్ దాడి జరిగినట్లు గుర్తించారు. దీంతో పోర్టల్ కొంత సమయం పాటూ పనిచేయలేదు. సుమారు 50 మంది విద్యార్థులు అనధికారికంగా పోర్టల్‌లోకి ప్రవేశించి వ్యవస్థను తారుమారు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read..
విద్యార్థినులకు మూడు రోజులు నెలసరి సెలవులు
సంబంధిత వార్తలు

Supreme Court | 9వ తరగతిలో మూడో భాష వద్దు : సుప్రీంకోర్టు
జులై 16, 2026

CBSE Three Language Policy | భాష నేర్చుకుంటే వృథా కాదు: సీబీఎస్ఈ పాలసీకి సుప్రీం ఓకే!
జులై 14, 2026

Congress Nationwide Protest | దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సై! ‘నీట్’ వివాదం, రాజ్యసభ నామినేషన్ రద్దుపై మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా బిగ్ ప్లాన్
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి
- ●Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు
- ●BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు

Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్

Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!



