Strait of Hormuz | ఉద్రిక్తతల మధ్యే హర్మూజ్‌ను దాటుతున్న భారత నౌకలు.. సీక్రెట్‌ను రివీల్ చేసిన కేంద్రం
Strait of Hormuz | కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత్‌కు చెందిన పలు నౌకలు (Indian Ships) మాత్రం ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకూ అనేక నౌకలు జలసంధిని దాటి సురక్షితంగా భారత పోర్టులకు చేరాయి. ఈ నేపథ్యంలో హర్మూజ్‌లో భారత నౌకల సురక్షిత ప్రయాణానికి అనుసరిస్తున్న సీక్రెట్ వ్యూహాన్ని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ (shipping ministry) తాజాగా పంచుకుంది.
Strait of Hormuz | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఈ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పూర్తిగా దిగ్బంధనంలో చిక్కుకుంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న ఈ ఇరుకైన మార్గం ప్రపంచ ఇంధన రవాణాకు చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే వెళ్తుంది. అయితే, తాజా ఉద్రిక్తతలతో జలసంధిలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ఇంధన మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి.
ఇక ఈ జలసంధి వద్ద ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ భారత్‌కు చెందిన పలు నౌకలు (Indian Ships) మాత్రం ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకూ అనేక నౌకలు జలసంధిని దాటి సురక్షితంగా భారత పోర్టులకు చేరాయి. ఈ నేపథ్యంలో హర్మూజ్‌లో భారత నౌకల సురక్షిత ప్రయాణానికి అనుసరిస్తున్న వ్యూహాన్ని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ (shipping ministry) తాజాగా పంచుకుంది. తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఈ జలసంధి గుండా భారత నౌకలు రాకపోకలను ఎలా నిర్వహిస్తోందనే అంశానికి సంబంధించిన కీలక వివరాలను ఇటీవల నిర్వహించిన మంత్రిత్వ శాఖల అంతర్గత సమీక్ష సమావేశంలో అధికారులతో పంచుకుంది.
ప్రాధాన్యత జాబితా ఆధారంగా..
హర్మూజ్‌లో భారత నౌకలు సీక్రెట్ జర్నీ చేస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇరాన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమస్వయం చేసుకుంటూ భారత నౌకలను రహస్యంగా జలసంధిని దాటిస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోలియం, సహజ వాయువు, ఎరువులు.. ఇలా అవసరమైన వస్తువుల సరఫరాలపై ముందుగా ఆయా మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరుపుతామని.. ఆ తర్వాత ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేస్తామని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ వివరించారు. ఆ జాబితా ఆధారంగా నౌకలను సీక్రెట్‌గా జలసంధిని దాటిస్తామని వెల్లడించారు. జలసంధి వద్ద ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ ఈ మార్గం గుండా సముద్ర రవాణాను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నౌకల సురక్షిత ప్రయాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
జలసంధిలో ఇంకా 13 భారతీయ నౌకలు
ప్రస్తుతం భారత జెండాలతో ఉన్న 13 నౌకలు హర్మూజ్ జలసంధి వద్దే ఉన్నాయని షిప్పింగ్ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ తెలిపారు. వీటిలో ఒకటి ఎల్‌పీజీ ట్యాంకర్, ఐదు ముడి చమురు ట్యాంకర్లు, కెమికల్ ట్యాంకర్ ఒకటి, మూడు కంటైనర్ నౌకలు, రెండు సరకు రవాణా నౌకలు వంటివి ఉన్నాయని వివరించారు.
ఇప్పటి వరకూ జలసంధిని దాటిన నౌకలు..
ఫిబ్రవరి 28 నుంచి ఈ జలసంధిని సురక్షితంగా దాటిన నౌకల్లో శివాలిక్, నందా దేవి, జగ్ లాడ్కి, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టైర్ (BW Tyr), బీడబ్ల్యూ ఎల్మ్ (BW Elm), గ్రీన్ సాన్వి ఉన్నాయి.
Also Read..
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి
సంబంధిత వార్తలు

Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధన శాఖ మంత్రి వెల్లడి..
ఆగస్టు 22, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026

Stock Markets | చమురు ధరల ఆందోళనతో కుదేలైన మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ నష్టాల్లో..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి
- ●Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు
- ●BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు

Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్

Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!



