Patriot Review | పేట్రియాట్ రివ్యూ – మమ్ముట్టి, మోహన్‌లాల్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
మమ్ముట్టి, మోహన్‌లాల్ హీరోలుగా నటించిన మలయాళం మూవీ పేట్రియాట్ జీ5 ఓటీటీలో తెలుగులోనూ రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
Entertainment | Published On Jun 6, 2026, 12.40 pm IST
Patriot Review | మలయాళ టాప్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ హీరోలుగా నటించిన పేట్రియాట్ మూవీ ఇటీవల జీ5 ఓటీటీలో రిలీజైంది. ఫహాద్ ఫాజిల్, నయనతార, దర్శనా రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మలయాళం మూవీ జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?
డేనియల్ పోరాటం...
డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి) డిఫెన్స్ రీసెర్చ్ వింగ్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తుంటాడు. డిఫెన్స్ మినిస్టర్ జేపీ సుందరం (రాజీవ్ మీనన్), అతడి కొడుకు శక్తి (ఫహాద్ ఫాజిల్) కలిసి పెరిస్కోప్ అనే సీక్రెట్ యాప్ ఉపయోగించి ప్రజల వ్యక్తగత డాటాను చోరీ చేస్తున్నారని డేనియల్ కనిపెడతాడు. తమ అక్రమాలను బయటపెట్టకుండా ఉండేందుకు డేనియల్‌పై దేశద్రోహిగా ముద్రవేస్తాడు శక్తి. దేశ రహస్యాలను శత్రువులకు అమ్ముతున్నాడంటూ ఆరోపణలు చేయడంతో డేనియల్ దేశం విడిచిపారిపోతాడు. లండన్‌లో ఉంటూ విమథన్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటాడు. శక్తి చేసే మోసాలను వెలుగులోకి తీసుకొస్తుంటాడు. ఓ యూట్యూబ్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన డేనియల్‌ను శక్తి కిడ్నాప్ చేసి ఇండియాకు తీసుకొచ్చి చంపాలని అనుకుంటాడు. ఈ జర్నీలో శక్తి మనుషుల బారి నుంచి డేనియల్ తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? ఈ పోరాటంలో డేనియల్‌కు సాయం చేసిన కల్నల్ రహీమ్ నాయక్ (మోహన్‌లాల్) ఎవరు? శక్తితోనే కలిసి పనిచేసిన మైఖేల్ (కుంచకోబోబన్) అతడిని ఎందుకు ఎదురుతిరిగాడు? జ్యోతి కురియన్‌తో (దర్శనా రాజేంద్రన్) పాటు మినిస్టర్ నళిని (రేవతి) మరణాలకు శక్తికి ఉన్న సంబంధం ఏమిటి? శక్తి అక్రమాలను డేనియల్ ఎలా బయటపెట్టాడు? అతడిని ఎలా శిక్షించాడు అన్నదే ఈ మూవీ కథ.
డేటా చోరీ...
ఇదివరకు దొంగలు డబ్బు, నగలు దోచుకునేవారు. కానీ ఇప్పుడు దొంగతనాల తీరు మారింది. సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లను హ్యాక్ చేసి ఎదుటివారి జీవితాల్లోని రహస్యలను సేకరిస్తూ వారిని దోచుకుంటున్నారు. తెలియకుండానే ఫోన్లలో సీక్రెట్ యాప్స్ నిక్షిప్తం చేస్తూ డేటా చోరీకి పాల్పడుతున్నారు. ఈ డిజిటల్ దోపిడీలో అసలు దొంగ ఎవరన్నది తెలుసుకోవడం కష్టమే. దేశభద్రతకు ముప్పుగా మారిన డేటా చోరీ నేపథ్యంలోనే మహేష్ నారాయణన్ పేట్రియాట్ సినిమాను తెరకెక్కించారు.
తమ అధికారం, పలుకుబడిని అడ్డుపెట్టుకొని కొందరు నాయకులు జనాలను ఎలా మోసం చేస్తున్నారు? ఉచితాల పేరుతో ప్రజలు ఉపయోగించే వాటిలో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయన్నది సందేశాత్మకంగా చూపించారు.
డాక్యుమెంటరీలా....
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అనగానే ఫాస్ట్ ఫేజ్ స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్ట్‌లు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లను ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాటికి భిన్నంగా పేట్రియాట్ ఉంటుంది. ప్రతి సీన్‌ను డిటైలింగ్‌గా చెబుతూ ఓ డాక్యుమెంటరీలా తెరకెక్కించారు. అదే ఈ సినిమా కమర్షియల్‌గా ఫెయిల్ కావడానికి కారణమైంది.
సెకండాఫ్ అదుర్స్....
ఫస్ట్ హాఫ్‌లో శక్తితో పాటు అతడి తండ్రి చేసే అక్రమాలకు సంబంధించిన ఆధారాలను డేనియల్ సేకరించడం, యూట్యూబర్‌గా మారి విదేశాల నుంచి విలన్‌పై అతడు చేసే పోరాటం చుట్టూ నడిపించారు. ఈ సీన్లు ఓపికకు పరీక్ష పెడతాయి. ఎప్పుడైతే డేనియల్‌ను శక్తి కిడ్నాప్ చేస్తాడో అక్కడి నుంచే సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. శక్తి వేసే ప్లాన్స్‌ను రహీమ్ నాయక్, మైఖేల్‌లతో కలిసి డేనియల్ తిప్పికొట్టే సీన్లు బాగున్నాయి. మోహన్‌లాల్‌పై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, ఓ ఛేజింగ్ సీన్ బాగున్నాయి.
టాప్ స్టార్స్....
పేట్రియాట్‌లో మలయాళంలోని టాప్ స్టార్స్ అందరూ నటించారు. డేనియల్ లాంటి పాత్రలు గతంలో మమ్ముట్టి చాలానే చేశారు. ఆ అనుభవంతోనే క్యారెక్టర్‌లో ఈజీగా ఒదిగిపోయారు. ఈ సినిమాలో మోహన్‌లాల్ సెకండాఫ్‌లోనే కనిపిస్తారు. ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ చేశారు. నయనతార పాత్రకు అస్సలు ఇంపార్టెన్స్ లేదు. స్టైలిష్ విలన్‌గా ఫహాద్ ఫాజిల్ నటన బాగుంది. కుంచకోబోబన్, రేవతి, దర్శనా రాజేంద్రన్ టాలెంట్‌ను డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు.
పేట్రియాట్ మమ్ముట్టి, మోహన్‌లాల్ యాక్టింగ్ కోసం చూడొచ్చు. కాస్త ఓపికగా చూస్తే డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసిన అనుభూతిని పంచుతుంది.
తాజావార్తలు
- ●Delhi Hotel Fire | కుక్ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీ హోటల్లో మంటలు.. వెలుగులోకి కీలక విషయాలు
- ●Meta | ఫేస్బుక్ క్రియేటర్లకు మెటా ఏఐ గిఫ్ట్.. కొత్త క్రియేటర్ అసిస్టెంట్ తో సక్సెస్ రహస్యాలు మీ చేతిలో..
- ●Latha Rajinikanth | ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన లతా రజినీకాంత్.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?
- ●Kavvampalli Satyanarayana | రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పడిన లిఫ్ట్.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ముప్పు
- ●Post Office NSC | రూ.11 లక్షలు పెట్టుబడి.. వడ్డీగా రూ.5 లక్షలు పొందవచ్చు..
- ●Reels | రీల్స్‌కు బాగా అలవాటు పడ్డ జెన్ జీ తరం.. మెటా వెల్లడి..

Delhi Hotel Fire | కుక్ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీ హోటల్లో మంటలు.. వెలుగులోకి కీలక విషయాలు

Meta | ఫేస్బుక్ క్రియేటర్లకు మెటా ఏఐ గిఫ్ట్.. కొత్త క్రియేటర్ అసిస్టెంట్ తో సక్సెస్ రహస్యాలు మీ చేతిలో..

Latha Rajinikanth | ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన లతా రజినీకాంత్.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?

Kavvampalli Satyanarayana | రెండో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పడిన లిఫ్ట్.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ముప్పు






