Post Office NSC | రూ.11 లక్షలు పెట్టుబడి.. వడ్డీగా రూ.5 లక్షలు పొందవచ్చు..
Post Office NSC | పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న వారికి పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతోపాటు కేంద్ర ప్రభుత్వం భద్రతకు హామీ ఇవ్వడం వల్ల ఇవి పూర్తిగా రిస్క్-ఫ్రీ పెట్టుబడి పథకాలుగా పేరుగాంచాయి. సరైన మొత్తాన్ని పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలోనే దాదాపు రూ.5 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
Post Office NSC | పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న వారికి పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతోపాటు కేంద్ర ప్రభుత్వం భద్రతకు హామీ ఇవ్వడం వల్ల ఇవి పూర్తిగా రిస్క్-ఫ్రీ పెట్టుబడి పథకాలుగా పేరుగాంచాయి. సరైన మొత్తాన్ని పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలోనే దాదాపు రూ.5 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకాలలో ముఖ్యంగా పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (పీఓ ఎన్‌ఎస్‌సీ) స్కీమ్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఒకసారి పెట్టుబడి పెట్టి ఐదేళ్ల పాటు కొనసాగిస్తే చక్రవడ్డీ ప్రయోజనంతో మంచి కార్పస్‌ను నిర్మించుకోవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. పోస్టాఫీస్ ఎన్‌ఎస్‌సీ ఖాతాను తెరవడం చాలా సులభం. సమీప పోస్టాఫీస్‌ను సందర్శించి కనీసం రూ.1వేయితో ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. అంటే పెట్టుబడిదారులు తమ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.
వడ్డీ ఇలా వస్తుంది..
ప్రస్తుతం ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌పై ప్రభుత్వం 7.7 శాతం వార్షిక వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీని చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. అయితే వడ్డీ మొత్తం ప్రతి సంవత్సరం చెల్లించకుండా, మెచ్యూరిటీ సమయంలో ఐదేళ్ల తర్వాత ఒకేసారి జమ అవుతుంది. అందువల్ల పూర్తి ప్రయోజనం పొందాలంటే పెట్టుబడిని లాక్-ఇన్ కాలం ముగిసే వరకు కొనసాగించడం అవసరం. పిల్లల పేరుతో కూడా ఎన్‌ఎస్‌సీ ఖాతాలు తెరవవచ్చు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరుతో తెరిచిన ఖాతాలను తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నిర్వహిస్తారు. ఈ పోస్టాఫీస్ పథకంలో ఆన్‌లైన్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టే సౌకర్యం అందుబాటులో ఉంది. వడ్డీ రూపంలోనే రూ.5 లక్షల వరకు ఎలా సంపాదించవచ్చో చూస్తే, 7.7 శాతం వడ్డీ రేటుతో ఒక పెట్టుబడిదారు రూ.11 లక్షలను ఒకేసారి పెట్టుబడి పెట్టి ఐదేళ్ల పాటు కొనసాగిస్తే, మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.15,93,937 అందుకుంటారు. ఇందులో రూ.4,93,937 వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం అవుతుంది.
లాక్-ఇన్ వరకు ఉంచాలి..
అయితే ఈ ఖాతాను లాక్-ఇన్ పీరియడ్ పూర్తికాకముందే మూసేస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక సంవత్సరం తర్వాత ఖాతాను మూసేస్తే పెట్టిన అసలు మొత్తం మాత్రమే తిరిగి లభిస్తుంది. వడ్డీ ప్రయోజనం ఉండదు. ఈ పథకం మరో ముఖ్యమైన ప్రయోజనం పన్ను మినహాయింపు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పెట్టుబడిదారులు పన్ను రాయితీ పొందవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు




